HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Review In Godavari Pushkaralu 2027

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

  • Author : Prasad Date : 03-06-2026 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
GODAVARI PUSHKARALU REVIEW
GODAVARI PUSHKARALU REVIEW

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు పెరగాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై మంత్రుల కమిటీ, వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సమీక్షలో సీఎం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు రహదారిని అఖండ గోదావరిగా అభివృద్ధి చేయాలన్నారు. కేవలం పుష్కరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనులు పరిమితం చేయకుండా, ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. పుష్కరాల నిర్వహణతో రాజమహేంద్రవరం మహా నగరంగా అభివృద్ధి చెందాలని సీఎం చెప్పారు.

హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్, రైల్వే ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీపైనా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం, ఎవరికీ ఎలాంటి గందరగోళం లేకుండా పుష్కర ఘాట్లకు నెంబరింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం, విశాఖ నుంచి విజయవాడ వరకూ రైలు సర్వీసులు పెంచడం జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రత్యేక రైళ్ల గురించి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాయడంతో పాటు, గోదావరి పుష్కరాలకు కేంద్ర సాయాన్ని కోరాలన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం కుంభమేళా తరహాలో టెంట్ సిటీలను, హోం స్టేలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గోదావరి పుష్కరాలను అభివృద్ధికి అద్భుతమైన అవకాశంగా చూడాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల పుష్కర పనుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇరువైపులా రహదారులు నిర్మించడంతో పాటు, గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ చేయాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరంలోని వీరేశలింగం పంతులు ఇంటిని కూడా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రముఖ్య ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయవేత్తలు, సినిమా సెలబ్రిటీలను కూడా గోదావరి పుష్కరాలకు ఆహ్వానించాలన్నారు. జూన్ 24న యాక్షన్ ప్లాన్‌తో రావాలని, అప్పటి నుంచి పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందని సీఎం చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీ, టీటీడీ సంయుక్తంగా రద్దీ నిర్వహణ ప్రక్రియను చేపట్టాలన్నారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని చెప్పారు. అలాగే గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి రెండూ నిరాటంకంగా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు.

పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో సహా కొత్తగా 237 ఘాట్లను నిర్మించాలని ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర పొడవైన పుష్కర ఘాట్లను 9.9 కిలోమీటర్ల మేర పెంచాలని నిర్ణయించారు. పోలవరం జిల్లా గుండాలలో మొదటి ఘాట్… కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురంలో చివరి ఘాట్ నిర్మించ తలపెట్టారు. ఈసారి పుష్కరాల్లో పుణ్య స్నానాల కోసం 9.95 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991లో 1.2 కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు చేయగా, 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తుల పుష్కర స్నానాలు చేశారు. గత పుష్కరాల్లో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తుల పుష్కర స్నానం చేయగా, ఈసారి ఒక్కరోజులో 1 కోటి మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ.211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • CM Chandrababu
  • Godavari pushkaralu 2027
  • tdp

Related News

Sajjala

YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

రెండేళ్ల చంద్రబాబు కూటమి పాల‌న‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని ఆరోపించారు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ద‌గా, మోసం, వెన్నుపోటుకి ప‌రాకాష్ట‌గా ఈ రెండేళ్ల కూట‌మి పాల‌న నిలిచిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు వెన్నుపోటు పాల‌న‌కు రెండేళ్లు పేరుతో తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్

  • CM Chandrababu

    CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • AP TDP

    AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

Latest News

  • CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

  • AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd