HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Saap Chairman Fires On Ysrcp

AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • Author : Prasad Date : 01-06-2026 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP TDP
AP TDP

డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నాయకత్వం కోర్టుల్లో వందలాది కేసులు వేసిందని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలతో యువతను ఆకర్షించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదని రవినాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీ టీచర్ పోస్టులు లేవని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కేవలం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి, అది కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడేలా చేశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, 16,300కు పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు.

డీఎస్సీ నియామకాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కోర్టుల్లో సుమారు 240 కేసులు దాఖలయ్యాయని ఆయన ఆరోపించారు. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో, అధికారులు మరియు న్యాయ నిపుణుల సహకారంతో అన్ని అడ్డంకులను అధిగమించి డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టులపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన రవినాయుడు, ఆ నియామకాల ప్రక్రియపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అవకతవకలపై వైసీపీ నుంచి ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP DSC
  • AP DSC Merit List
  • ap tdp
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

    Latest News

    • World Music Day: కూకట్‌పల్లి లో ఘనంగా ‘ప్రపంచ సంగీత దినోత్సవం’

    • Rain Alert: ఏపీ భారీ వర్షాలు..

    • Sreeleela: శ్రీలీలను అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య

    • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు..

    • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd