HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Dk Shivakumar To Take Oath As Karnataka Chief Minister Today

CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Author : Prasad Date : 03-06-2026 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
DK SHIVA KUMAR
DK SHIVA KUMAR

కర్ణాటక రాజకీయాల్లో షూటర్ గా పేరొందిన డీకే శివ‌కుమార్‌.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. కర్ణాటక ఈ రోజు సాయంత్రం 6గంట‌ల‌కు రాష్ట్ర క‌ర్ణాట‌క‌ 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామ‌య్య నుంచి అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్‌భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి దశలో 10 నుంచి 15 మంది వరకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ జాబితాను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. సిద్దరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన కొందరికి కొనసాగింపు లభించే అవకాశం ఉండగా, కొత్త ముఖాలకు కూడా చోటు కల్పించనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ‌వింద‌ర్ సింగ్ తదితరులు హాజరుకానున్నారు. అలాగే పలువురు రైతు నాయకులు, దళిత ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, మతపెద్దలు, కన్నడ ఉద్యమకారులను కూడా ఆహ్వానించారు.

డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన స్వస్థలమైన క‌న‌క‌పుర‌లో సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం కారణంగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అయిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో ‘ఎ’ కేటగిరీ సభ్యుడిగా నియమించింది. డీకే శివకుమార్‌కు అధికార బదిలీ సజావుగా జరిగేలా సహకరించినందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • CM DK SHIVAKUMAR
  • CM Siddaramaiah
  • congress
  • dk shiva kumar
  • karnataka

Related News

33 new crest gates for Tungabhadra Dam inaugurated by three Chief Ministers.

Tungabhadra: ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన‌నున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd