HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Special Representative For North America Komati Jayaram Receives A Warm Welcome In Dallas

NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Author : Prasad Date : 01-06-2026 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NRI TDP
NRI TDP

అమెరికాలోని తెలుగువారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండగలగడం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగల ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తి ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా మెలగుతానని చెప్పారు. డల్లాస్ లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోమటి జయరాం కు ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జయరాం మాట్లాడుతూ మాతృభూమి రుణం తీర్చుకోవడంలో విశిష్ట పాత్ర పోషిస్తున్న ప్రవాసాంద్ర తెలుగు వారి సేవలను ప్రత్యేకంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ప్రవాసాంధ్రులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికాలోని తన వంటి అనేకమంది తెలుగువారికి జయరాం గురువుతో సమానమని కొనియాడారు. ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం పార్టీ తరపున ఆయనతో కలిసి తాను కూడా అమెరికా అంతటా పర్యటించానని గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాలతో సహా ప్రతి రాష్ట్రంలోని తెలుగువారితో ఇంతటి విస్తృత పరిచయాలు ఉన్న వ్యక్తి మరొకరు లేరు అని పెమ్మసాని కితాబిచ్చారు. జయరాం ఎన్ఆర్ఐలు అందరికీ నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని, నిజానికి ఆయన కార్యదీక్ష సమర్థతలకు ఈ పదవి చాలా చిన్నదని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ జయరాం కోమటి బోళామనిషి అని, రాష్ట్రంలో ఎంతోమంది పార్టీ నాయకులకు పైకి కనపడకుండానే జయరాం ఎంతో మద్దతు అందించారని, అండగా నిలిచారని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • komati jayaram
  • NRI
  • NRI TDP
  • tdp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Latest News

  • World Music Day: కూకట్‌పల్లి లో ఘనంగా ‘ప్రపంచ సంగీత దినోత్సవం’

  • Rain Alert: ఏపీ భారీ వర్షాలు..

  • Sreeleela: శ్రీలీలను అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు..

  • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd