HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Major Real Estate Fraud Case Reported In Suryapet

Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Author : Prasad Date : 03-06-2026 - 7:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Real Estate Fraud
Real Estate Fraud

తక్కువ డ‌బ్బుల‌కు అధిక రాబ‌డులు వ‌స్తాయ‌ని న‌మ్మించి ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ పట్టణంలోని శ్రీరంగపురం గ్రామంలో జ‌రిగింది. తమను దాదాపు రూ. 11 కోట్లు మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళ‌న చేశారు. దీంతో శ్రీరంగపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అధిక వడ్డీ రేట్లు, అసలు మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి, సుమారు 45-50 మందిని తన వద్ద రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టేలా ఒప్పించారని పోలీసులు తెలిపారు. అతని హామీలను నమ్మి, గ్రామస్తులు కొంత కాలం పాటు పెద్ద మొత్తంలో డబ్బును అందజేశారని.. అయితే ఆ వ్యాపారవేత్త వడ్డీ చెల్లింపులను నిలిపివేయ‌డం.. అసలు మొత్తాలను తిరిగి ఇవ్వ‌డంలేద‌ని గ్రామ‌స్తులు ఆరోపించారు. మే 13న, తాను బాకీ ఉన్న రూ. 11 కోట్లకు బదులుగా, వడ్డీతో సహా సుమారు రూ. 9 కోట్లు మాత్రమే చెల్లించగలనని తెలియజేస్తూ అతను లీగల్ నోటీసులు పంపాడు. మరోవైపు వ్యాపారి త‌న ఆస్తులన్నింటినీ వెల్లడించడం లేదని, వాస్తవానికి పూర్తి రూ. 11 కోట్లు తిరిగి చెల్లించే స్తోమత అతనికి ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై దాదాపు నెల రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, జూన్ 1న వ్యాపారి తన సోదరి పేరు మీద రెండు ప్లాట్లు కొనడంతో గ్రామస్తులకు అనుమానం వ్య‌క్తమ‌యింది. దీంతో వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వ్యాపారవేత్త నివాసం ముందు నిరసన చేపట్టడంతో, పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళ‌న‌ను విర‌మించేలా చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Real Estate Fraud
  • Suryapeta

Related News

    Latest News

    • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

    • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

    • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

    • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

    • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd