CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని సీఎం తెలిపారు.
- By Latha Suma Published Date - 05:04 PM, Mon - 3 March 25

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించనుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. దాదాపు రూ. 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని సీఎం తెలిపారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు.
Read Also: AP Housing : ఏపీలో ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ..వేలల్లో దరఖాస్తులు
ఈ మైలురాయి స్వర్ణాంధ్ర విజన్ 2047 కి అనుగుణంగా భారతదేశం యొక్క హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించాలనే మా నిబద్ధతను కూడా ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఆ దిశగా ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు విజయం గాజు, ఉక్కు, పెట్రోకెమికల్స్, రసాయనాలు వంటి పరిశ్రమలకు విస్తృతమైన అవస్థాపన మరమ్మత్తుల అవసరం లేకుండా హైడ్రోజన్ ఆధారిత పరిష్కారాలను స్వీకరించడానికి బ్లూప్రింట్‌ను అందిస్తుంది. ఐదు సంవత్సరాలు. దాని వ్యూహాత్మక తీర ప్రయోజనాలు, లోతైన సముద్రపు ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్ మరియు పరిశ్రమ-స్నేహపూర్వక విధానాలతో, ఆంధ్రప్రదేశ్ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు గ్లోబల్ హబ్‌గా మారడానికి సిద్ధంగా ఉందన్నారు. దీని లక్ష్యంతో 160 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మరియు తదుపరి విలువ సుమారు 8 బిలియన్ డాలర్లు అని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌కు సహకారం అందిస్తాయని చెప్పారు. విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి అనువైందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏడాదికి 206 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుంచి 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుందని సీఎం వివరించారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని రానున్న రోజుల్లో దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Madhabi Puri Buch : బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్