Madhabi Puri Buch : బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాధవి పురి బుచ్,హోల్ టైమ్ సభ్యులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జి, కమలేష్ చంద్ర వర్ష్నీ, బీఎస్‌ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలు హైకోర్టును ఆశ్రయించారు.
- Author : Latha Suma
Date : 03-03-2025 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్ మాధవి పురీ బచ్ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బచ్‌తో పాటు బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ సుందరరామన్ రామమూర్తి, పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్, సెబీ పూర్తికాల సభ్యులు అశ్వనీ భాటియా, అనంత్ నారాయణ్, కమలేశ్ చంద్ర వర్ష్నేలపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఆదేశాలను కొట్టి వేయాలంటూ వారు అత్యవసర విచారణను కోరారు.
Read Also: Hyderabad : హైదరాబాద్‌లో ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణం జరుపుకోవచ్చు..?
అయితే,ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాధవి పురి బుచ్,హోల్ టైమ్ సభ్యులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జి, కమలేష్ చంద్ర వర్ష్నీ, బీఎస్‌ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలు హైకోర్టును ఆశ్రయించారు. నియంత్రణ విధానాల్లో లోపాలు ఉన్నట్లు,కొందరు వ్యక్తులు కుమ్మక్కయినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. దీనిపై జస్టిస్ ఎస్‌జీ డిగే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మంగళవారం విచారణ జరపనుంది. అప్పటి వరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు అమలుచేయొద్దని ఆదేశించారు.
కాగా, సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌పై స్టాక్ మార్కెట్‌లో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముంబయిలోని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి ఏక్‌నాథ్‌రావు బంగర్ ఆదేశాలు జారీ చేసిన విసయం తెలిసిందే. ఆమెతో పాటు మరో అయిదుగురు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన విదేశీ ఫండ్ల వ్యవహారంలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపణలు వెల్లువెత్తాయి. షార్ట్ సెల్లింగ్ సంస్థ, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన సంగతి తెలిసిందే.
Read Also: AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు.. !