HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Launches The Book Cbn361 Degrees In Singapore

Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-06-2026 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.
CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ‘రేపటికోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ, న్యూజిల్యాండ్ మాజీ ప్రధాని జెసిందా ఆర్డర్న్ వంటి ప్రపంచ స్థాయి నేతల మాదిరిగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన విజన్‌లు, అమరావతి రాజధాని నిర్మాణం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో ఏపీ రెరా మాజీ ఛైర్మన్ రామనాథ్ పలు సందర్భాల్లో వెల్లడించిన అభిప్రాయాల్లోని కీలక అంశాలను కూడా పొందుపరిచినట్టు రచయిత తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి బహూకరించారు.

గతంలో విడుదలైన ‘చంద్రబాబు x.0’ పుస్తకం సాఫ్ట్ కాపీని సుమారు 8 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. దాని స్ఫూర్తితో రూపొందిన ఈ పుస్తకాన్ని త్వరలోనే తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేసేవారికి, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెరా మాజీ ఛైర్మన్ రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్‌తో పాటు సింగపూర్‌లోని పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • CBN 361 Degrees Book
  • CBN Singapore Tour

Related News

Chandrababu

Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Chandrababu's birthday wishes to Balayya

    HappyBirthdayNBK: బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్

Latest News

  • Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Redmi Turbo 5: భారీ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. రెడ్‌మీ టర్బో 5.. స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్

  • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • Cough Syrup: దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

  • Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd