HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Key Instructions On Heavy Rains

Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్ర‌బాబు

మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

  • Author : Gopi Date : 13-08-2025 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

Heavy Rains: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై (Heavy Rains) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్, తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Also Read: MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

వరద నీటిని సద్వినియోగం చేయండి

ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృథాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.

గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి

మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Ministers
  • ap news
  • cm camp office
  • CM Chandrababu
  • heavy rains
  • rains

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rain warning for AP...

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd