CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
- By Latha Suma Published Date - 05:51 PM, Sun - 8 September 24

Prakasam Barrage: ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రకాశం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) 65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
పనులపై సీఎం చంద్రబాబు ఆరా ..
గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో సిఎం చంద్రబాబు మాట్లాడారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవలసిన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడుకి సీఎం సూచించారు. ఇక రానున్న రెండు రోజులలో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని, అయితే అది కష్టంతో కూడుకున్నది అని కన్నయ్య నాయుడు వివరించారు.
ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు చేరిక..
కాగా, విజయవాడను వర్షం వీడడం లేదు..శనివారం కొన్ని గంటల పాటు విజయవాడలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
Read Also: Harish Rao : కాంగ్రెస్ నిర్లక్ష్యంతో.. 9 నెలల్లో 475 మంది రైతుల ఆత్మహత్యలు