Pension Distribution
-
#Andhra Pradesh
AP Pension : పింఛన్ పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..!
ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందజేస్తుండగా, ఈసారి నూతన సంవత్సర దినోత్సవం నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Published Date - 04:00 PM, Thu - 26 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Published Date - 07:36 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
Volunteers : ఏపీలో వాలంటీర్లు ఇక లేనట్లే..!
Volunteers : మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. ‘‘అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. గత ప్రభుత్వాల చర్యల వల్లే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. వలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించాం. కానీ, లేని ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి? ఈ వ్యవస్థ అమల్లో ఉంటే మేం కొనసాగి ఉండేవాళ్లమని మంత్రి చెప్పారు.
Published Date - 06:55 PM, Wed - 20 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.
CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.
Published Date - 06:40 PM, Fri - 1 November 24