Free Gas Cylinders
-
#Andhra Pradesh
CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.
CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.
Published Date - 06:40 PM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
Free Gas Cylinders : దీపం-2 పథకం..పెట్రోలియం సంస్థలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Free Gas Cylinders : ఏడాదికి నాలుగు నెలలకు ఒకటికి చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత సిలిండర్లకు ఏడాదికి మొత్తం రూ.2,684 కోట్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెక్కు రూపంలో అందజేసింది.
Published Date - 04:13 PM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
Free Gas Cylinder : ఏపీలో దీపం పథకానికి విశేష స్పందన..
Free Gas Cylinder : “దీపం పథకం” ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని నవంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి, ప్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్‌లకు కావలసినంత మంది రోజుకు మూడు రెట్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవుతున్నారు. ప్రజలు గ్యాస్ కనెక్షన్ కోసం తెల్లరేషన్ కార్డు , ఆధార్ కార్డుతో గ్యాస్ కంపెనీల వద్ద క్యూ కట్టడం కనిపిస్తోంది.
Published Date - 10:01 AM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
AP Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సీలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి పండగ నుంచి ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిలో భాగంగా, ప్రతీ ఏడాది దీపావళి నుంచి 3 ఉచిత […]
Published Date - 01:09 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ముగిసిన కేబినెట్ భేటి.. పలు కీలక నిర్ణయాలు ఇవే..
CM Chandrababu : ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.
Published Date - 04:07 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
Published Date - 10:09 AM, Wed - 16 October 24