CM Chandrababu : రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.
- By Kavya Krishna Published Date - 05:40 PM, Thu - 26 June 25

CM Chandrababu : సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పోలీస్ శాఖని విషాదంలో ముంచింది. విచారణ కోసం నిందితుల అన్వేషణలో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసుల కారు, కోదాడ బైపాస్ సమీపంలోని దుర్గాపురంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Debt : కూటమి సర్కార్ అప్పులపై జగన్ కామెంట్స్
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు పట్ల ఘనంగా నివాళి అర్పిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలపై అధికారులతో మాట్లాడినట్లు సీఎం తెలిపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, అవసరమైన సాయం వెంటనే అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణంగా అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు అయ్యుండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో శోకచ్ఛాయలు అలుముకున్నాయి.
Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు