CM Chandrababu: ఆంధ్రాను పరుగులు తీయిస్తున్న సీఎం చంద్రబాబు..ఈయన మనిషా.. ప్రజా తపస్వా!
కాళ్లు నొక్కుకొంటూ చాలామంది కనిపించారు. పొద్దున ఎలా కూర్చొన్నారో అలా.. అదే ఉత్సాహంతో.. ఆ వయసులో అలా కూర్చోవడం సాధ్యమా? అంత ఏకాగ్రతతో రోజంతా మనసు లంగ్నం చేసి ఓ మనిషి పనిచెయ్యడం సాధ్యమా అంటే.. ఒక ఉదాహరణగా లైవ్లో కనిపిస్తూ అందరినీ తెల్లబోయేలా చేశారు.
- By Gopichand Published Date - 11:13 AM, Fri - 13 December 24

CM Chandrababu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభ్యున్నతి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. సీఎం హోదాలో ఉన్నా.. కొంచెం కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఏపీని మున్ముందుకు తీసుకెళ్తున్నారు. రాత్రీ పగలు ప్రపంచమంతటా ప్రజలు సెర్చ్ చేసే గూగుల్.. వైజాగ్ నగరాన్ని సెర్చ్ చేసి మరీ ఎంచుకుంది. దీనికి కారణం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన. లోకేశ్ శ్రమతో రాష్ట్రానికి దక్కిన గూగుల్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు హుటాహుటిన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ వైపు చంద్రబాబు.. మరోవైపు లోకేశ్ ఏపీని పురోగతి బాటలో తీసుకెళ్లేందుకు చెమటోడుస్తున్నారు. ఇంతగా శ్రమిస్తున్నా వారిలో కొంచెం కూడా అహంభావం కానీ, అహంకారం కానీ లేవు. ఇటీవలే కలెక్టర్ల సమావేశానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఓ అరగంట లేటయ్యారు. దానికి స్వయంగా చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నారు. ఎందుకు లేటైంది అనే దానిపై కలెక్టర్లకు సంజాయిషీ చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం అంటే ఇదే మరి!!
దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి మొదలైన సమావేశంలో మధ్యాహ్నం దాటిన తరువాత భోజనం కోసం అందరికీ ముప్పావు గంట బ్రేక్ ఇచ్చారు. అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది దాటినా.. చంద్రబాబు ఏ మాత్రం అలసట లేకుండా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. పొద్దున వచ్చిన చంద్రం లెక్కనే సాయంత్రం కూడా ఆయన ఒక్కరే ఏపీ సచివాలయంలో కనిపించారు. తన ప్రక్కన మంత్రుల పరిస్థితి, ముందున్న వారి పరిస్థితి చూసి జాలి పడి ఈరోజు అజెండాలో అంశాలు మిగిలి వున్నా.. రేపు పొద్దున 9కే వచ్చేయండి అని చెప్పి చంద్రబాబు ముగించారు. పొద్దున నుంచి సచివాలయంలోనే ఉన్నా.. అలసట అనేది లేకుండా అధికారులతో చంద్రబాబు మాట్లాడటాన్ని కంటిన్యూ చేశారు.
సగటు మనిషికి ఇదంతా చేయడం అసాధ్యం. పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అలుపు లేకుండా ప్రతి ఒక్కరి మాటలనూ గంటల తరబడి చెవులు రిక్కించి వింటూ.. అక్కడిక్కడక్కడే సందేహాలను తీర్చడం చాలా గొప్ప విషయం. ప్రశ్నలను అడుగుతూ.. చురకలు వేస్తూ.. నవ్విస్తూ.. గంటల తరబడి గడపడం ఓ మనిషికి అలా సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా చంద్రబాబు పనితీరు ఉంటుంది. ఆయన పనిచేస్తుంటే.. ఎంతో మంది వెళుతూ వస్తూ కనిపించారు. కాళ్లు నొక్కుకొంటూ చాలామంది కనిపించారు. కానీ చంద్రబాబు మాత్రం పొద్దున ఎలా కూర్చున్నారో అలాగే.. అదే ఉత్సాహంతో కూర్చున్నారు. ఆ వయసులో అలా కూర్చోవడం సాధ్యమా? అంత ఏకాగ్రతతో రోజంతా మనసును లగ్నం చేసి ఓ మనిషి పని చేయడం సాధ్యమా అంటే.. ఒక ఉదాహరణగా లైవ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపిస్తూ అందరినీ తెల్లబోయేలా చేశారు.
Also Read: Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధరలివే.. మీ నగరంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
పైవన్నీ తెలుసుకున్నాక.. చంద్రబాబు మనిషా.. ప్రజా తపస్వా అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. గతంలో ఇలాంటి సమీక్ష సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు మాత్రమే జగన్ నిర్వహించేవారు. తరువాత అన్నీ జూం మీటింగులే జరిగేవి. అవి కూడా ప్రత్యక్ష ప్రసారం చేయకుండా మూకీ టాకీలో సాక్షి చూపేది. ఒక విధ్వంసం నుంచి ఒక విజన్ వైపుగా ఏపీ అధికార యంత్రాంగాన్ని నడుపుతూ.. ఎటువంటి ఆంక్షలు లేకుడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా పారదరదర్శకంగా చూపిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.అందుకే ఏపీ ప్రజలు అదృష్టవంతులు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవా తపస్సు చేస్తున్న ఒక ప్రజా మహర్షి చంద్రబాబు. 2047లో ఏపీ రాష్ట్రం ఇలా వుండాలి అని చంద్రబాబు కంటున్న కలలకు, దాని కోసం ఉచ్చరిస్తున ప్రతి మంత్రోపదేశాన్ని వినడం మన జన్మ అదృష్టం, పూర్వ జన్మ సుకృతం.
దేశ అత్యున్నత సివిల్స్ చదివి, ర్యాంకులు తెచ్చుకొని ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆలోచనలకు రెక్కలు తొడుగుతూ.. ముస్సోరిలో పాఠాలు చెప్పే గురువు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉత్సాహపరుస్తుంటే.. గత ఐదేళ్ల మౌనాన్ని బద్దలు కొడుతూ.. నోరు విప్పి జనం కోసం ఆలోచనలు పంచుకొంటూ.. గురువు వద్ద సందేహాలు నివృత్తి చేసుకుంటుంటే అబ్బురంగా చూసింది ఆంధ్రా. విధ్వంసం నుంచి విజన్ వైపు పయనం మొదలెట్టి.. పట్టాల మీద లక్ష్యం వైపు వేగంగా ప్రయాణం చేస్తున్న మన ఆంధ్రా అద్బుతాలు సృష్టిస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఏపీని ఈ ఋషి నిలుపుతారు.