AP CM: జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చినజీయర్ స్వామి
రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వనించారు.
- By Balu J Published Date - 03:09 PM, Sat - 20 November 21

రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వనించారు. శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో రామానుజ ఆచార్య 1000వ జయంతి సందర్భంగా ‘శ్రీరామానుజ సహస్రాబ్ది’కి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో 45 ఎకరాలకు పైగా స్థలంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య స్వామి విగ్రహాన్ని, సమానత్వ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వైష్ణవ సాధువు విగ్రహం ప్రపంచంలోనే రెండో ఎత్తైన కూర్చున్న విగ్రహంగా పేరొందనుంది.
ముచ్చింతల్ గ్రామంలోని ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుండి ఫిబ్రవరి 14, 2022 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం జగన్ ను కలిసినవాళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.ఎస్. సుబ్బారెడ్డి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు.
Related News

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి
ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి