HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababus Family In The Service Of Lord Srivaru

Chandrababu Naidu Family Tirumala Darshan: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2026 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Devansh Birthday
Nara Devansh Birthday

Nara Devansh Birthday  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాదాలను భక్తులకు వడ్డించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర చంద్రబాబు కుటుంబానికి ఈవో ముద్దాడ రవిచంద్ర, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.

శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇవ్వగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను ఛైర్మన్, ఈవోలు అందించారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు కుటుంబం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించింది. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కాలి నడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్‌కు వెళ్లారు. తిరుమల మాడవీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. అలాగే తిరుమల మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో చంద్రబాబు, దేవాన్ష్ ఫోటో దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల దగ్గరకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. కొందరు భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. ముఖ్యమంత్రి తిరుమల అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరికి కీలక సూచనలు చేశారు. సీఎం తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం అతిథిగృహంలో ముగ్గురితో సమీక్ష చేశారు. తిరుమలలో విద్యుత్‌ వినియోగం, విండ్‌ మిల్‌ నుంచి విద్యుదుత్పత్తి, వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో వాతావరణ పరిస్థితిపై ఆరా తీశారు. తిరుమలలో భక్తుల వసతి, తిరుపతిలో వసతి పెంపునకు చేస్తున్న ప్రణాళికల్ని అడిగి తెలుసుకున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhrapradesh
  • Minister Nara lokesh
  • nara bhuvaneswari
  • nara brahmani
  • Nara Devansh Birthday
  • Tirumala Temple
  • Tirumala temple visit
  • Tirumala Tirupati Devasthanams (TTD)

Related News

The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

    TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd