HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu To Inaugurate The Rayalaseema Steel Plant In Kadapa

Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2026 - 2:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.
CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్‌తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్నారు. తొలిదశ పూర్తయ్యేసరికి ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ స్టీల్ ప్లాంట్‌తో పాటు, దీనికి అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే కాకుండా, రాష్ట్రంలో 3,850 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మరో రూ.20,350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చింది.

వర్చువల్‌గా విజయనగరం పార్కు ప్రారంభం
ఈ కార్యక్రమం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.531 కోట్ల పెట్టుబడితో 1166 ఎకరాల్లో ఈ పార్కును అత్యాధునిక వసతులతో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేశారు.

ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో సీఎం ఆసక్తి..
అంతకుముందు, స్టీల్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మినియేచర్ మోడల్, నియో ఎనర్జీ ప్లాంట్ వివరాలను సజ్జన్ జిందాల్ ఆయనకు వివరించారు. హైదరాబాద్‌లో జేఎస్‌డబ్ల్యూ తయారుచేస్తున్న డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ ఏఐ టెక్నాలజీ గురించి సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రక్షణ, పౌర అవసరాలకు డ్రోన్ల తయారీపై దృష్టి సారించాలని, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలోని వసతులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విపత్తుల సమయంలో వినియోగించే ప్రత్యేక వాహనాలను కూడా ఆయన పరిశీలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • JSW Rayalaseema Steel Plant
  • Kadapa Steel Plant

Related News

Capital war reignites in AP... Amaravati versus Mavigan...

Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడ

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • 'Made in Jonnagiri' gold enters the market.

    Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

Latest News

  • Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

  • Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

  • Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd