AP: న్యాయం గెలిచింది. మీ పాపాలే…రేపు శాపాలుగా మారుతాయి: చంద్రబాబు..!!
- By Bhoomi Updated On - 11:51 AM, Fri - 4 November 22

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎట్టకేలకు కోర్టులో ఊరట లభించింది. గురువారం అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయ్యన్న,రాజేశ్ ల రిమాండ్ ను తిరస్కరించింది. వారిపై ఐపీసీ 467సెక్షన్ కింద కేసు మోపారాని అది వర్తించదని కోర్టు తెలిపింది. దీంతో వారిద్దరికీ బెయిల్ మంజూరు అయ్యింది.
దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. వారిద్దరికీ బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందన్నారు. న్యాయమే గెలుస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఐడీ టార్చర్ ఆఫీసుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి రేప్ కేసు…కోర్టులు మొట్టికాయలు, చివాట్లు పెట్టిన ఈ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని కొట్టినట్లు మా దగ్గర సమాచారం ఉంది. ఈ కేసులో పోలీసులు వ్యవహారించిన తీరుపై అధికారులను కూడా శిక్షించవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు శిక్షపడటం ఖాయమన్నారు. ఇవాళ మీరు చేసిన పాపాలే…రేపు మీకు శాపాలుగా మారుతాయంటూ మండిపడ్డారు.

Related News

YSRCP : మరో కొత్త కార్యక్రమం చేపడుతున్న వైసీపీ.. పథకాలు పొందే వారి ఇళ్లకు..!
వైసీపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తుంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా