Chandrababu Naidu:ఇప్పటంలో కాదు ముందు ఇక్కడెయ్యండి రోడ్డు!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
- Author : Hashtag U
Date : 07-11-2022 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో కాదు.. ఇక్కడ వేయండి రోడ్డు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని మల్లాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలోని దుస్థితికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాక్టర్ కూడా వెళ్లలేని స్థితిలో అక్కడి రోడ్డు ఉంది.
ఇప్పటంలో కాదు ముందు ఇక్కడెయ్యండి రోడ్డు!#ChatthaRoadsChatthaCM #APRoads #WorstRoads #JaganFailedCM pic.twitter.com/TpKfkiJHFY
— N Chandrababu Naidu (@ncbn) November 7, 2022
రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పటంలో కొన్ని కట్టడాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ చర్యలను విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. తమకు ఓటు వేయని వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని విమర్శించాయి. చంద్రబాబు సైతం ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వం మరోసారి విమర్శలు గుప్పించారు. చెత్త రోడ్లు చెత్త సీఎం అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.