Central Minister Comments : అమరావతి రాజధానిపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్.. రాజధానిని..?
అమరావతి రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన బైపాస్...
- Author : Prasad
Date : 15-09-2022 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధానులు మూడు పెట్టుకుంటారో, నాలుగు పెట్టుకుంటారో మీ ఇష్టమని..కానీ అభివృద్ధికి విఘాతం కలిగించకుడదని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. ప్రభుత్వ సహకారం లేదు కాబట్టే ఇప్పటి వరకు ఎయిమ్స్ కి నీరు ఇవ్వలేదన్నారు. అమరావతిని రాజదానిగా అందరూ గుర్తించారని ఆయన తెలిపారు. బైపాస్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి రాష్త్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఆయన కోరారు. అమరావతి రాజధాని కాబట్టే ఎయిమ్స్,జాతీయ రహదారులు ఇచ్చారని.. ఉమ్మడి కృష్ణజిల్లా, గుంటూరు జిల్లాతో పాటు అమరావతి అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వo ఏ నిర్ణయం తీసుకున్న అభివృద్ధి పనులు ఆగకుడదన్నారు.