HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Central Government Showering Blessings On Amaravati

Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2026 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central government showering blessings on Amaravati
Central government showering blessings on Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణం కోసం సీపీడబ్ల్యూడీ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపగా, బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ. 1,299.08 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రూ. 1,234.91 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయం (జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కాంప్లెక్స్) నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో కొలువుదీరనున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీస్టోరీ నివాసాలు నిర్మించనున్నారు.

మరోవైపు అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు కోసం 22.53 ఎకరాలను సీఆర్‌డీఏ ఇప్పటికే కేటాయించింది. 5.53 ఎకరాల్లో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తి అయ్యింది. అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో నడుస్తుండగా, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి అయితే ఇవన్నీ కూడా సెక్రటేరియట్ కాంప్లెక్స్ భవనంలోకి మారనున్నాయి.

సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టును పర్యావరణ హితంగా.. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఐకానిక్ డిజైన్‌తో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా సెంట్రల్ సెక్రటేరియట్ భవనం రాజధాని అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోట చేరడం ద్వారా పాలనలో వేగం పెరగడంతో పాటు, అన్ని సేవలు కూడా ప్రజలకు ఒకే చోట లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Central Government Infrastructure Projects
  • Indian PM Narendra Modi
  • UNION Cabinet

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

Latest News

  • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

  • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

  • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

  • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd