HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Case Has Been Registered Against Vice Jagan In Hyderabad

YS Jagan : వైఎస్‌ జగన్ పై హైదరాబాద్‌లో కేసు నమోదు

Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

  • Author : Latha Suma Date : 22-09-2024 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Case has been Registered Against YS Jagan in Hyderabad: తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీనిపై కలత చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూ దైవత్వానికి ప్రతీక అని, ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టేనని తెలిపారు. అలాగే పవిత్రతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డూ ప్రసిద్ధి పొందిందని, లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని, ఈ చర్య గత ప్రభుత్వ కుట్రలో భాగమేనని కరుణ్ సాగర్ ఆరోపించారు.

Read Also: Chiranjeevi Guinness Record : మెగాస్టార్​ ఖాతాలో మరో రికార్డ్

ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ మెడకు చుట్టుకుంటుంది. గత ప్రభుత్వ హాయాంలోనే తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో ఈ అంశంలో జగన్ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రసాదం తయారీలో కూడా అవినీతికి పాల్పడటమేంటని అధికార పక్ష నేతలు మండిపడుతుండగా.. మరోవైపు కలియుగ దైవంగా కొలిచే శ్రీవారిని అప్రతిష్టపాలు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాగా.. ఇప్పుడు ఏకంగా జగన్ పైనే కేసు నమోదు కావడం ఆయన్ను చిక్కుల్లో పడేసినట్టు అయ్యింది. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Mumbai: ముంబై వెర్సోవా బీచ్‌ నిమజ్జనంలో అపశ్రుతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Advocate K. Karun Sagar
  • case registered
  • High Court
  • Saidabad Police Station
  • Tirupati Laddu Controversy
  • ys jagan
  • ysrcp

Related News

First Women Justice Of AP High Court

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు

Justice Lisa Gill ఆంధ్రప్రదేశ్ న్యాయరంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్ ఠాకుర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ

  • Massive Fire Accident In Amaravati

    అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

  • Gas Cylinder Booking : గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

  • AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

  • New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

  • TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd