BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!
దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఉన్నారు.
- By Maheswara Rao Nadella Published Date - 02:49 PM, Wed - 14 December 22

తెలంగాణ ఉద్యమ పార్టీ (TRS) జాతీయ పార్టీగా మారింది. బీఆర్ఎస్ (BRS) పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఉన్నారు. ఏపీలో (Andhra Pradesh) సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ ఏపీ (BRS – AP) బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. సంక్రాంతికి ఏపీలో (Andhra Pradesh) బీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది.
ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ (KCR) భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ (KCR) అప్పగించారు. ఏపీ (Andhra Pradesh) మూలాలు ఉండి హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న ప్రముఖులతో కేసీఆర్ (KCR) ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ (KCR) ఉన్నారు. తొలి దశలో ఏపీ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu), మహారాష్ట్రలో (Maharashtra) పోటీ చేయాలని భావిస్తున్నారు.
Also Read: BRS Flexes: బీఆర్ఎస్ కు షాక్.. ఢిల్లీలో ఫ్లెక్సీలు తొలగింపు!