Vivekananda Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్! ఆయన అరెస్ట్ పై ఉత్కంఠ
ఇప్పటికి రెండు సార్లు సీబీఐ ఎదుట హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి నోటీసులు అందుకున్నారు. వాటిని పరిశీలిస్తే ఈ సారి ఆయన అరెస్ట్ ఉంటుందని
- By CS Rao Published Date - 12:45 PM, Sun - 5 March 23

ఇప్పటికి రెండు సార్లు సీబీఐ ఎదుట హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి నోటీసులు అందుకున్నారు. వాటిని పరిశీలిస్తే ఈ సారి ఆయన అరెస్ట్ ఉంటుందని నమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రెండో సారి పిలిచినప్పుడు సుదీర్ఘ విచారణ చేశారు. అప్పుడే అరెస్ట్ తప్పదని అనుకున్నారు. కానీ, ఢీల్లీ కాల్ ఏదో ఆపిందని వివేకా (Vivekananda) అభిమానులు భావించారు. కానీ ముచ్చటగా మూడోసారి సీబీఐ ఆయన్ను పిలవడం అరెస్ట్ కోసం అంటూ ప్రచారం బలంగా జరుగుతుంది. అయితే ఈ సారి కూడా ఢిల్లీ లాబీయింగ్ పనిచేస్తే మాత్రం ఇప్పట్టలో ఆయన అరెస్ట్ ఉండదని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీస్ లు ఇచ్చారు. ఆ రోజు బిజీగా ఉందని అవినాష్ చెప్పినప్పటికీ ‘నో’ అన్నారట. దీంతో ఈ సారి ఆయన అరెస్ట్ ఉంటుందని చెప్పటానికి చాలా ఛాన్స్ ఉంది.
వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే అనేక దఫాలుగా విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు, ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. పులివెందుల లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు . ఈ నెల 6వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి చెప్పి వెళ్లారు . ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. కాగా, వివేకా (Vivekananda) హత్య కేసులో మొదటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు.
ఇక అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరిందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా వేసిన కౌంటర్ లో అవినాష్ సూత్రధారిగా సీబీఐ తేల్చింది. ఆ తరువాత గూగుల్ టేక్ ఔట్ ద్వారా సూత్రధారులు, పాత్రధారులు కదలికలను గుర్తించింది. ఇక ఫైనల్ గా రెండోసారి విచారణకు హాజరైన అవినాష్ ఇచ్చిన లెటర్ మీద అధ్యానం చేసింది. దాని మీద కొన్ని సందేహాలను ప్రశ్నించటంతో పాటు అరెస్ట్ ను ఫైనల్ చేయడానికి సోమవారం ముహూర్తంగా వివేకా అభిమానులు విశ్వసిస్తున్నారు. ఉత్కంటగా ఉన్న ఈ ఎపిసోడ్ ముగింపు ఏమిటో చూడాలి.
Also Read: Rajiv Jain: మునిగిపోతున్న అదానీ నౌకను నిలబెట్టిన రాజీవ్ జైన్ ఎవరు?

Tags
- amaravati
- andhra pradesh
- ap
- ARREST
- Avinash
- case
- court
- murder
- police
- Viveka
- vivekananda
- Vivekananda Reddy

Related News

CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హ�