iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
- By Vamsi Chowdary Korata Published Date - 05:20 PM, Mon - 17 November 25
ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్‌పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా ఉన్నాడని.. అతడు విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పారు.
పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులకే సవాల్ విసిరిన అతడిని పక్కా సమాచారంతో.. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన కొడుకు అరెస్ట్‌పై ఇంతకుముందు తన తండ్రి అప్పారావు స్పందించారు. తన అబ్బాయి రూ. కోట్లు సంపాదించినా.. తనకు తినడానికి తిండి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తన కొడుక్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. కానీ లాళ్ల అమ్మ లాగా క్రిమినల్ బ్రెయిన్ ఉందని షాకింక్ కామెంట్స్ చేశారు.
తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. కొడుకు ఇమ్మడి రవికి కూడా.. మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవని అతడి తండ్రి అప్పారావు అన్నారు. కానీ అతడికి వాళ్ల అమ్మ లాంటి క్రిమినల్ బ్రెయిన్ వచ్చినట్టు ఉందంటూ మండి పడ్డారు. తన వంశంలో ఇలాంటి ఖిలాడీలు లేరన్న అప్పారవు.. వాళ్ల అమ్మ బ్రెయిన్ మంచిది కాదని చెప్పారు. ఆమె అన్ని వ్యతిరేకమైన పనులు చేసేదని మండిపడ్డారు. తాను డ్యూటీకి వెళ్లకుండా తలుపులు వేసేదని ఆరోపణలు చేశారు. ఇలాంటి కారణాల వల్లే ఆమెతో విడిపోయానని చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చూసుకునేవాళ్లని.. కానీ ఇప్పుడు కొడుకు చేసిన ఘనకార్యానికి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిదంటూ అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఇమ్మడి రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అప్పారావు తెలిపారు. వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదని చెప్పారు. తన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు.. భార్యతో విడిపోయానని.. అందువల్లే రవి ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిపారు. అయితే రవిని తాను ఎప్పుడూ డబ్బులు అడగలేదని.. అతడు తనకు ఇవ్వలేదని వెల్లడించారు. రవి ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు 15 ఏళ్లు అవుతోందని తెలిపారు.
ఐ బొమ్మ ఇమ్మడి రవి అరెస్టుపై.. తండ్రి అప్పారావు ఇంతకుముందు కూడా స్పందించారు. తన కొడుకు రవిని పోలీసులు అరెస్టు చేశారని.. తమ బంధువులు చెప్తే తెలిసిందని అన్నారు. రవి ఫోటోని పేపర్లతో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు చూసి.. అరెస్ట్ విషయం తెలుసుకున్నానని చెప్పారు. డిగ్రీ వరకు చదివించి ఉద్యోగం కోసం హైదరాబాద్ పంపించానని తెలిపారు. కానీ, రవి విదేశాల్లో ఉన్నాడనే విషయం తనకు తెలియదని అప్పారావు అన్నారు. ఈ వయసులో కొడుకును కాపాడే శక్తి, ఓపిక తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.