HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government To Sit On Election Violence

AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్‌ ఏర్పాటు..!

  • Author : Latha Suma Date : 17-05-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP government to sit on election violence
SIT report to DGP on election violence in AP!

AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్‌ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టిమ్‌ సిట్‌(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక సిట్ ఇవ్వనుంది.  పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, , చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు చేయనుంది.  అయితే తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఏపీ సర్కార్‌.

We’re now on WhatsApp. Click to Join.

తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు….రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే వేటు వేసింది ఈసీ. ఇక అటు జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది ఇంటెలిజెన్స్‌. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్‌ ఇచ్చింది ఇంటెలిజెన్స్‌.

Read Also: Warm-Up Schedule: బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. గురువారం వారితో భేటీ అయింది. ఎన్నికల వేళ ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఈసీ.. ఈ భేటీ తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగిందని.. దాన్ని నియంత్రించేందుకు స్థానిక అధికారులు పూర్తిగా విఫలం అయినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వారిద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • central election commission
  • election violence
  • SIT

Related News

AP Government to Provide Identity and Ration Cards to Transgender People Minister Dolabala Veeranjaneya Swamy.

AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు మరో తీపి కబురు చెప్పింది. అమరావతిలో జరిగిన ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. వారికి సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. ట్రా

  • CM Chandrababu Naidu

    Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

Latest News

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

  • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd