HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Anti Drone System Will Be Installed On Tirumala Hills

Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?

తిరుమల కొండలపై యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది.

  • Author : Pasha Date : 13-05-2025 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anti Drone System On Tirumala Hills Ttd Ap Govt Drones

Tirumala Hills: ప్రస్తుతం డ్రోన్లు కలవరపెడుతున్నాయి. చిన్న సైజులోనే ఉన్నా.. అవి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద శక్తులు  డ్రోన్లతో భారత్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే పెను ముప్పు కూడా పొంచి ఉంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండలపై గతంలో చాలాసార్లు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తిరుమలలో గగనతల భద్రతకు ఎవరూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యాంటీ డ్రోన్‌ వ్యవస్థను త్వరలోనే తిరుమలలో అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. తిరుమలపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడును కోరుతామన్నారు. ఈమేరకు ఇప్పటికే  కేంద్ర మంత్రికి ఆయన లేఖ కూడా రాశారు. త్వరలోనే ఆ దిశగా అనుమతులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. తిరుమల కొండల పరిధిలో ఎవరూ డ్రోన్లను ఎగురవేయలేరు.  ఒకవేళ డ్రోన్లను ఎగురవేసినా.. యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేసి కూల్చేస్తారు. డీఆర్‌డీఓలో కీలక హోదాల్లో సేవలు అందించిన డాక్టర్ సతీష్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక సలహాదారుడిగా ఉన్నారు. ఆయన సూచనల మేరకు తిరుమలలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

Also Read :Pawan Kalyan : ‘ఎస్-400’‌ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్

వైఎస్సార్ సీపీ హయాంలో ఒట్టి మాటలే.. 

తిరుమల కొండలపై యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది. బెంగళూరులోని భెల్‌ సంస్థ తయారు చేసిన అత్యాధునిక నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఏడీఎస్‌)‌ను కొంటామని ప్రకటించింది.  కోట్లాది రూపాయలు విలువైన ఆ పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదిస్తున్నట్లు అప్పట్లో వైఎస్సార్ సీపీ సర్కారు చెప్పింది.  కొంతకాలానికి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది.

భద్రతా లోపం వల్లే ఈ ఘటనలు.. 

  • 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్‌ గ్యాస్‌ ప్లాంట్‌ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్‌తో శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను చిత్రీకరించారు.
  • 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్‌ 53వ మలుపు వద్ద డ్రోన్‌ ఎగురవేసి శ్రీవారి మోకాలు మెట్టు, నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు.
  • ఇటీవలే రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్‌ అన్షుమన్‌ తరెజా  శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు.
  • పై విధమైన ఘటనలు జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్‌ అధికారులకు తెలపడం, వారు వచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అదే యాంటీ డ్రోన్‌ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్‌ ఎగిరే అవకాశమే ఉండదు.
  • సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. అయినా కొందరు భక్తులు తిరుమల కొండలపైకి డ్రోన్‌‌లను ఎలా తేగలుగుతున్నారు  అనే ప్రశ్న తలెత్తుతోంది. భద్రతా లోపం వల్లే డ్రోన్లను తిరుమల కొండలపైకి తేగలుగుతున్నారు.

Also Read :Samantha : హమ్మయ్య.. నిర్మాతగా మొదటి సినిమాతోనే లాభాల్లో సమంత.. ‘శుభం’ మొదలైంది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Anti-Drone System
  • ap govt
  • Drones
  • tirumala
  • tirumala hills
  • ttd

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

    TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd