Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
- By Latha Suma Published Date - 12:58 PM, Mon - 10 March 25

Anganwadis Protest: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్‌వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులుశతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్‌వాడీలు తరలి వచ్చారు.
Read Also: SVSN Varma: ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్
అయితే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఈ విధంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు అంగన్‌వాడీలు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
మరోవైపు అనంతపురం నుంచి అంగన్‌వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. వైఎస్‌ఆర్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్‌లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఇక, మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
Read Also: Rapido : రాపిడోతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం