HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Football Player Killed In Attack By Rivals

AP Footballer Killed: మద్యం మత్తులో ఫుట్ బాల్ ప్లేయర్.. 16 పోట్లు పొడిచి హత్య!!

విజయవాడలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఆకాశ్(23) అనే ఫుట్ బాల్ ప్లేయర్ మద్యం మత్తులో ఉండగా హత్యకు గురయ్యాడు.

  • Author : Hashtag U Date : 01-06-2022 - 7:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime

విజయవాడలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఆకాశ్(23) అనే ఫుట్ బాల్ ప్లేయర్ మద్యం మత్తులో ఉండగా హత్యకు గురయ్యాడు. 10 మంది దుండగులు కలిసి విచక్షణా రహితంగా 16 కత్తిపోట్లు పొడవడంతో అక్కడికక్కడే ఆకాశ్ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడి మృతదేహాన్నీ శవపరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

టోనీ అనుచరులవి రెండు గ్యాంగ్ లు ఉన్నాయి. ఈ రెండు గ్యాంగ్ల సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం మద్యం తాగేందుకు సమీపంలోని లిక్కర్ షాపుకు వెళ్లారు. ఈ రెండు గ్యాంగ్ లలో ఒకదానిలో ఆకాశ్ సభ్యుడిగా ఉన్నాడు. మద్యం తాగుతుండగా రెండు గ్యాంగ్ల మధ్య మాటకు మాట పెరిగింది. ఈక్రమంలో ఆకాశ్ మరో గ్యాంగ్ లోని ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆకాశ్ ను అతడి గ్యాంగ్ సభ్యుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక మద్యం మత్తులో ఆకాశ్ నిద్రలోకి జారుకున్నాడు. అతడి చుట్టూ ముగ్గురు తోటి గ్యాంగ్ సభ్యులు రక్షణ గా కూర్చొని ఉన్నారు. ఇంతలోనే అవతలి గ్యాంగ్ కు చెందిన 10 మంది అక్కడికి చేరుకున్నారు.

వాళ్ళను చూడగానే ఆకాశ్ వద్ద కూర్చున్న ఇద్దరు మిత్రులు పారిపోయారు.ఆకాశ్ మరో స్నేహితుడిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత.. నిద్రలో ఉన్న ఆకాశ్ ను కత్తులు, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. దీనికి సంబంధించి పటమట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh state level
  • football player
  • murder
  • stabbed to death
  • vijayawada

Related News

Featherlight

Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు

    Latest News

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    • Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

    • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

    • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

    • Pithapuram వర్మపై టీడీపీ వేటు

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd