Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:06 PM, Tue - 16 April 24

Election 2024: దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికల సందడి మొదలు కానుంది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గతేడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోకసభ ఎన్నికలకు సిద్దమవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి.
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఎన్నికల హడావుడి పీక్స్ కు వెళుతుందనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటింగ్ జరగనుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతలకు ఇంకా బీ-ఫారం అందలేదు. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కోబోతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది కాస్త సవాలుగా మారనుంది.
We’re now on WhatsApp. Click to Join
ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
ఏప్రిల్ 18న నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25న నామినేషన్లకు చివరి తేదీ
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
మే 13న పోలింగ్
జూన్ 4న ఎన్నికల ఫలితాలు
Also Read: CM Revanth: యూపీఎస్సీలో పాలమూరు బిడ్డకు 3వ ర్యాంకు.. కంగ్రాట్స్ చెప్పిన సీఎం రేవంత్