Tirumala Laddu : తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం – అంబటి రాంబాబు
Tirumala Laddu : తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు
- By Sudheer Published Date - 04:26 PM, Tue - 24 September 24

Tirumala Laddu Controversy : ఏపీలో తిరుమల లడ్డు వివాదం కూటమి vs వైసీపీ గా మారింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే..మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని వైసీపీ అంటుంది. అంతే కాదు దేవుడి ముందు ప్రమాణాలు సైతం చేస్తున్నారు. రోజు రోజుకు ఈ వివాదం తారాస్థాయి చేరుతుంది. ఇప్పటీకే ఈ వివాదం ఫై వైసీపీ (YCP) నేతలు తమ స్పందనలు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి అంబటి రాంబాబు (Ambati Rambabu ) దీనిపై స్పందించారు.
తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని, తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని తెలిపారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని అంబటి రాంబాబు విమర్శించారు.
టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. ‘తండ్రి చనిపోతే తలనీలాలు ఇవ్వని చంద్రబాబు (Chandrababu) హిందూధర్మం గురించి మాట్లాడటం దారుణం అని , పెద్ద ఆరోపణ చేసి దానిని నిరూపించలేకపోతున్నారని రాంబాబు అన్నారు. టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ (Pawan Kalyan) బూట్లు తుడుస్తాం. ఆయనెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్లే కదా చేయాలి’ అని అన్నారు.
Read Also : CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు..సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం