Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్‌గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
- By Latha Suma Published Date - 02:08 PM, Wed - 25 June 25

Chandrababu : నూతన రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన జాతీయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి నగరాన్ని శతాబ్దాల తర్వాత కూడా టెక్నాలజీలో అధిష్టానంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
Read Also: Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇది భద్రత పరంగా ఒక కొత్త దిశను సూచిస్తోంది అని చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు నాలెడ్జ్ టెక్నాలజీ సహాయంతో అనేక అద్భుతాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఇటువంటి ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిలో ఐటీ, హైటెక్ పరిశ్రమలు విస్తరించి, యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశంతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధి గురించి చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచే విధంగా నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో, కానీ మేము అమరావతిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దనున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ టెక్నాలజీ మొదలైన రంగాల్లో వినూత్న సాంకేతికతను అమలు చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా అమరావతి అభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాంకేతికతతో కూడిన శాశ్వత పురోగతి దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.
Read Also: AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు