HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >All The Buttons I Pressed Are Equal To The Pensions I Give Cm Chandrababu

CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు

గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.

  • Author : Latha Suma Date : 01-04-2025 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
All the buttons I pressed are equal to the pensions I give: CM Chandrababu
All the buttons I pressed are equal to the pensions I give: CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నామన్నారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులని చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.

Read Also: T-MAAS Card: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక మెట్రో, ఆర్టీసీ ప్రయాణం సులభతరం…

మిగుల్చుకోవాలంటే నెలకు రూ.76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తున్నాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

గత పాలకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దివాళా తీయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11వేలకోట్లు కేంద్రం ఇచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ కూడా గాడిన పడింది. విశాఖకు రైల్వే జోన్‌ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల చేపట్టాం. మిగిలిన చోట కూడా పూర్తిచేస్తాం. ఈనెలలో మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తాం అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాజధాని అమరావతిని గాడిలో పెట్టాం. అక్కడ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది. దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. మూడు నాలుగేళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రానికి పోలవరం జీవనాడి. 2027 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bapatla District
  • Beneficiaries
  • CM Chandrababu
  • NTR Bharosa Pension Distribution Program
  • tdp

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd