PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి(PM Modi 75) 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెడతారు.
- By Pasha Published Date - 02:36 PM, Tue - 1 April 25

PM Modi 75 : ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఏడాది సెప్టెంబరులో రిటైర్ కావాలని అనుకుంటున్నారు. దీనిపై డిస్కస్ చేయడానికే ఇటీవలే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు’’ అని ఉద్ధవ్ శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దీంతో మరోసారి బీజేపీ నేతల రిటైర్మెంట్ ఏజ్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రధాని మోడీ 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని మెహసానా జిల్లా వాద్ నగర్‌లో జన్మించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి(PM Modi 75) 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెడతారు.
Also Read :Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
అద్వానీకి దక్కని అవకాశాలు..
బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ క్రిష్ణ అద్వానీ 1927 నవంబరు 8న జన్మించారు. 2019లో 91 ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభ టికెట్ కోసం అప్లై చేసుకుంటే.. టికెట్ దక్కలేదు. దీంతో అద్వానీ తీవ్ర నిరాశకు గురయ్యారు. వయసు 75 ఏళ్లు దాటినందు వల్లే అద్వానీకి అప్పట్లో లోక్‌సభ టికెట్ ఇవ్వలేదని టాక్ నడిచింది. అద్వానీకి కనీసం రాష్ట్రపతి పదవైనా దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. 2014లో బీజేపీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక.. పార్టీ కీలక కమిటీలలో అద్వానీకి చోటు లేకుండాపోయింది.
Also Read :Sea Cucumbers : సముద్రపు దోసకాయలపై స్మగ్లర్ల కన్ను.. కేజీ రూ.30వేలు.. ఏమిటివి ?
అలాంటి రూలేం లేదు..
గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ 2016లో తన పదవికి రాజీనామా చేశారు. వయసు 75 ఏళ్లు దాటడమే, ఆనందీబెన్ రాజీనామాకు ఒక ప్రధాన కారణమని అప్పట్లో చర్చ జరిగింది. వాస్తవానికి 75 ఏళ్లు దాటాక రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్న రూల్ ఏదీ బీజేపీ రాజ్యాంగంలో రాసి లేదు. దీనిపై ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఎన్నడూ ప్రకటన వెలువడలేదు. సందర్భాన్ని బట్టి దాన్ని సాకుగా వాడుకున్నారని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి సెప్టెంబరు 17 తర్వాత నరేంద్ర మోడీ రిటైర్ అవుతారనే ప్రచారంలో వాస్తవికత లేదని అంటున్నారు.