HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Letter To The Family Of Ys Call The Elders And Share The Stolen Money

A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచ‌ల‌న లేఖ‌.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెట‌ర్‌!

దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.

  • Author : Gopichand Date : 30-10-2024 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
A Letter To The Family Of YS
A Letter To The Family Of YS

A Letter To The Family Of YS: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తిక్కరేగిన ఏపీ రాష్ట్ర ప్రజలు రాస్తున్న బహిరంగ లేఖ (A Letter To The Family Of YS) అని ఒక లెట‌ర్ వైర‌ల్ అవుతోంది. అందులో గత వారం రోజులుగా ఆస్తుల పంపకాల్లో వచ్చిన వివాదాలపై వైఎస్ జగన్- షర్మిల ల మధ్య లేఖలు, కౌంటర్ లేఖలు, ఆరోపణలు, దాడులు, ఎదురు దాడులు, ఆవేదన, ఆక్రందనలు చూసి .రాష్ట్రంలో ఉన్న పౌరునిగా మెజారిటీ రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ కుటుంబానికి రాస్తున్న బహిరంగ లేఖ ఇది పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబంలో, స్వయంగా ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కొడుకు, సొంత సోదరితో, తల్లితో ఆస్తుల పంపకం కోసం పడుతున్న ఘర్షణ, రోడ్డెక్కి చేస్తున్న రచ్చ వెగటు పుట్టిస్తోంది. అసహ్యం కల్గిస్తోంది. ఏహ్యభావాన్ని(రోత) కల్పిస్తోందన్నారు.

దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు. మీ కుటుంబానికి సంబంధించి 2004కు ముందున్న అప్పులు ఎలా మాయం అయ్యాయో తెలుసు. అలాగే 2004 తరువాత వేల కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, మీడియా చానళ్లు, పేపర్లు, పరిశ్రమలు, కోట్ల విలువైన షేర్లు ఎలా వచ్చాయో, కాకలు దీరిన పారిశ్రామిక వేత్తలు సైతం నిర్మించలేని వ్యాపార సామాజ్యాలు ఎలా నిర్మితం అయ్యాయో కూడా తెలుసు. అయితే స్వతహాగా సెంటిమెంట్ ఎక్కువ ఉండే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా చనిపోయిన పెద్దాయన మీద ఉన్న గౌరవంతో మీకు మద్దతుగా నిలిచాం. అధికారాన్ని అందించాం. కానీ మీరేం చేశారో.. రాష్ట్రం ఎలా అయ్యిందో? మా బిడ్డల భవిష్యత్ ఎంత చీకటి మయం అయ్యిందో తెలుసుకుని 2024 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చాం. ఇప్పుడిప్పుడే కోలుకుని బతుకుల్లో వెలుగులు చూస్తున్నాం.

Also Read: Diwali Greetings: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌

ఇలాంటి సమయంలో దొంగిలించిన సొమ్ములో వాటాల కుదరక గొడవలు పడిన దొంగల్లా మీరు పడుతున్న ఘర్షణ చాలా నీచంగా ఉంది. అక్రమ ఆస్తులు, వాటి ద్వారా పదవులు, ఆ అధికారం ద్వారా మళ్లీ వేల కోట్ల దోపిడీ మాత్రమే తెలిసిన మీకు, మీ ఈ భాగోతం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టకపోవచ్చు. దేశంలో మరే దివంగత ముఖ్యమంత్రి, మరే మాజీ ముఖ్యమంత్రి సొంత కుటుంబంలో ఆస్తుల కోసం ఇంతగా దిగజారి, నైతికత అనేది లేకుండా వ్యవహరించడం ప్రజలుగా మేం చూడలేదు. భవిష్యత్ లో చూడలేము కూడా అని రాసుకొచ్చారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రజలుగా మేమంతా మరింత షాక్ కు గురయ్యింది దేనికంటే.. ఇంప్రెస్ చెయ్యడానికి పసుపు చీర అంటూ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సాయిరెడ్డి మాట్లాడడం. ఈ వివాదం ఏకంగా రాష్ట్రానికే మంచిది కాదని ఆమె చెప్పడం. రాష్ట్రానికి మంచిది కానిది, జరగకూడదనిది 2019లోనే జరిగిపోయింది. ఇక మళ్లీ అది జరగదు. రాష్ట్ర ప్రజలుగా మాకు ఆ క్లారిటీ ఉండబట్టే మొన్న ఆ తీర్పు ఇచ్చాం. ఇందుమూలంగా యావత్ రాష్ట్ర ప్రజలు మీ కుటుంబానికి విన్నవించి రాసేది ఏంటంటే.. తిన్నదేదో తిన్నారు.. నలుగురు పెద్దలను పిలిచి వారి సమక్షంలో సామరస్యంగా దొంగ సొమ్ము పంచుకోండి. ఈ రచ్చ ఆపండి. ప్రజలకు పనికొచ్చే పనేదైనా చేయండి. రాష్ట్ర ప్రజల బహిరంగ లేఖను పరిగణలోకి తీసుకోమని కోరుతూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ ప్రజానీకం అని ఒక లేఖ వైర‌ల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A Letter To The Family Of YS
  • Andhrapradesh
  • ap people
  • ap politics
  • congress
  • ys jagan
  • ys sharmila
  • ys vijayamma
  • ysr
  • ysrcp

Related News

Renamed Grama Ward Sachival

AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd