HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Will Work With You Both Donald Trumps Kashmir Offer To India And Pakistan

Kashmir Offer : భారత్, పాక్‌లకు ట్రంప్ ‘‘కశ్మీర్ ఆఫర్’’.. ఏమిటది ?

డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. భారత్, పాకిస్తాన్(Kashmir Offer) దేశాల డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మాట్లాడుకోనున్నారు.

  • By Pasha Published Date - 11:17 AM, Sun - 11 May 25
  • daily-hunt
Donald Trump Kashmir Offer India Pakistan Us Govt

Kashmir Offer : ‘‘కనీసం వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్‌ విషయలో పరిష్కారం లభిస్తుందో? లేదో? ఈ విషయంలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి భారత్, పాకిస్తాన్‌లతో కలిసి పనిచేయడానికి తాను రెడీ అన్నారు.  కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ వ్యవహారంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని సహించేది లేదని భారత్ ఎల్లప్పుడూ చెబుతుంటుంది. ఈ అంశంపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై  భారత్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్తాన్‌లు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయని శనివారం మధ్యాహ్నం ప్రకటన చేసిన ట్రంప్.. 6 గంటల తర్వాత కశ్మీరు అంశంపై మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ పోస్టులు పెట్టారు.

Also Read :Pawan Kalyan: మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తూ పవన్ ఎమోషనల్

త్వరలోనే క్లారిటీ 

డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. భారత్, పాకిస్తాన్(Kashmir Offer) దేశాల డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మాట్లాడుకోనున్నారు. ఏదైనా తటస్థ వేదికలో సమావేశమై కశ్మీర్ అంశంపై చర్చించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం రోజు ప్రకటించారు. తదుపరిగా జరగనున్న ఈ సమావేశాలు, చర్చలు కీలకంగా మారనున్నాయి. కశ్మీర్ అంశంలో భారత్, పాక్‌లు ఎలా స్పందిస్తాయి ? అనేది ఈ సమావేశాల్లో తెలిసిపోనుంది.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 12 నుంచి మే 18 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

ఉగ్రవాదంపైనే భారత్ ప్రధాన ఫోకస్ 

కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని అమెరికా, చైనా, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు గతంలోనూ ప్రకటించాయి. అయితే ఆ ప్రతిపాదనలను భారత్ ఎలాంటి సంకోచం లేకుండా తిరస్కరించింది. మూడోదేశం కశ్మీరు అంశం గురించి మాట్లాడొద్దని భారత్ తేల్చి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) సైతం తమదే అని గత కొన్నేళ్లలో చాలాసార్లు ఎన్‌డీయే సర్కారు పెద్దలు కుండబద్దలు కొట్టారు. అలాంటి వారు కశ్మీరు అంశం విషయంలో రాజీపడే ఛాన్సే లేదు. కశ్మీరులో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సమస్యపై భారత్ ప్రధాన ఫోకస్ పెట్టనుంది. పాక్‌లో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను పాకిస్తానే స్వయంగా ఏరిపారేసిన తర్వాతే.. ఆ దేశంతో చర్చలకు భారత్ ఆసక్తి చూపొచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • india
  • India vs Pakistan
  • Kashmir Offer
  • pakistan
  • US Govt

Related News

Donald Trump

Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Warning Bell : అమెరికాలో జరిగిన కీలక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి పెద్ద శోకాన్ని మిగిల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలనా విధానాలను సమర్థించని

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

Latest News

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd