Weekly Horoscope : వారఫలాలు.. మే 12 నుంచి మే 18 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
మేష రాశి : ఈ వారంలో మేష రాశి వారికి ధన యోగం(Weekly Horoscope) ఉంది.
- By Pasha Published Date - 09:17 AM, Sun - 11 May 25

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మే 12 నుంచి మే 18 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Mothers Day 2025 : ‘మదర్స్ డే’.. రామ్‌చరణ్, చిరు, నాని, సాయి పల్లవి ఎమోషనల్
మేష రాశి : ఈ వారంలో మేష రాశి వారికి ధన యోగం(Weekly Horoscope) ఉంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలను గడిస్తారు. అయితే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త పెట్టుబడి నిర్ణయాల విషయంలో జాగ్రత్త. ఇతరులతో గొడవకు దిగొద్దు. పూర్వపుణ్యం కాపాడుతుంది.
వృషభ రాశి : ఈ వారంలో వృషభ రాశి వారికి శుభ యోగం ఉంది. సంపదలు పెరుగుతాయి. ఆర్థిక వనరుల్ని పొదుపు, మదుపు దిశగా మళ్లించాలి.కొత్త పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోండి. అయితే నిపుణుల సలహాలు పొందండి. పెళ్లి వ్యవహారాల విషయంలో పండితుల సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెద్దగా కలిసిరాదు. చెడు ఆలోచనలతో నష్టమే.
మిథున రాశి : ఈ వారంలో మిథున రాశి వారు ఓ శుభవార్త వింటారు. నిర్ణయాలు తీసుకునే క్రమంలో తొందరపాటు వద్దు. మంచి నిర్ణయం మీ కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆవేశం వద్దు. నాలుకను అదుపులో ఉంచుకోండి.
కర్కాటక రాశి : ఈ వారంలో కర్కాటక రాశి వారికి శుక్రయోగం మేలు చేస్తుంది. ఆరోగ్య యోగం కూడా లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోండి. ముఖ్య ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పూర్వీకుల ఆస్తులు దక్కుతాయి. పాత అప్పు బకాయిలు వసూలవుతాయి. లక్ కలిసొస్తుంది.
సింహ రాశి : ఈ వారంలో సింహరాశి వారు కొత్త ప్రయత్నాలు చేయకపోవడమే బెటర్. ఉన్న పనులనే చక్కగా కొనసాగించండి. ఉద్యోగులు అనవసరంగా మాట పడతారు. సహనంతో వ్యవహరించండి. పెళ్లి వ్యవహారాలపై పండితుల సలహా తీసుకోండి. అప్పులు పెరిగే ముప్పు ఉంది. దుబారా ఖర్చులు ఆపేయండి. అత్యవసర ఖర్చులకే ప్రాధాన్యత పెంచండి. మనోబలంతో ముందుకు సాగండి.
కన్య రాశి: ఈ వారంలో కన్య రాశి వారు ఒక గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వస్తుంది. ఉద్యోగులకు మంచి టైం మొదలవుతుంది. శాలరీ పెరగడం, ప్రమోషన్ దక్కడం వంటివి జరగొచ్చు. ఇంటికి బంధువుల తాకిడి పెరిగి, ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ఆటంకాలు రావొచ్చు. సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి.
Also Read :Terrorist Attack: దేశంలో మరో ఉగ్రదాడి.. అసలు నిజం ఇదే!
తులా రాశి: ఈ వారంలో తులా రాశి వారికి అప్పులు పెరిగే అవకాశం ఉంది. పాత అప్పులు తిరిగి చెల్లించాలనే ఒత్తిడి పెరుగుతుంది. కొత్త అప్పులు చేయొద్దు. ఉన్నదాంట్లోనే సర్దుకోండి. దుబారాకు, విలాసాలకు పోవద్దు. ఉద్యోగులకు మరింత మెరుగైన జాబ్ ఆఫర్స్ వస్తాయి. అయితే తొందరపాటుతో జాబ్ మారొద్దు. జాబ్ ఆఫర్ వచ్చిన కంపెనీలోని వర్క్ కల్చర్ గురించి ఆరాతీయండి. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. ముఖ్యమైన పనుల్ని మధ్యలోనే ఆపేయకండి.
వృశ్చిక రాశి: ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ధనలాభం జరుగుతుంది. స్థిరాస్తులు కొనేందుకు మంచి టైం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
ధనుస్సు రాశి: ఈ వారంలో ధనుస్సు రాశివారికి వాహన యోగం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వేగంగా డ్రైవింగ్ చేయొద్దు. ఇతరులు విమర్శిస్తారు. వారిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. మానసిక ఆందోళన వెంటాడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను పండిస్తాయి.
మకరరాశి: ఈ వారంలో మకర రాశి వారికి వ్యాపారాలు కలిసొస్తాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. అయితే అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు చేయొద్దు. పాత అప్పులు వసూలవుతాయి. ఇతరులను త్వరగా నమొద్దు. మీ ఆలోచన మేరకే తుది నిర్ణయాలు తీసుకోండి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఏకాగ్రతతో పనులు చేయండి.
కుంభ రాశి : ఈ వాంలో కుంభరాశి వారికి భూలాభం జరగబోతోంది. కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టేందుకు ఇది మంచిటైం. తొందరపాటుతో ఏదిపడితే అది మాట్లాడితే సమస్యలు వస్తాయి. వీలైనంత తక్కువగా మాట్లాడితే బెటర్. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
మీన రాశి : ఈ వారంలో మీనరాశి వారికి ధనలాభం జరగొచ్చు. డబ్బులు వచ్చాయి కదా అని దుబారా ఖర్చులు చేయొద్దు. ఆస్తుల విషయంలో కొన్ని అగ్రిమెంట్లు జరగొచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగులు బాధ్యతల నిర్వహణలో నలుగురినీ కలుపుకుని వెళ్లండి. వీలైనంత సున్నితంగా సంభాషించండి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.