Bikini Killer: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి బికినీ కిల్లర్ విడుదల.. కోర్టు ఆదేశాలు.. ఎవరు.. ఏమిటి?
బికినీ కిల్లర్ (Bikini Killer)గా పేరుగాంచిన చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సప్నా ప్రధాన్ మల్లా, టిల్ ప్రసాద్ శ్రేష్ఠలతో కూడిన ధర్మాసనం శోభరాజ్ (Charles Sobhraj)ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
- By Hashtag U Published Date - 07:01 AM, Thu - 22 December 22

బికినీ కిల్లర్ (Bikini Killer)గా పేరుగాంచిన చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సప్నా ప్రధాన్ మల్లా, టిల్ ప్రసాద్ శ్రేష్ఠలతో కూడిన ధర్మాసనం శోభరాజ్ (Charles Sobhraj)ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత కాలం కంటే ఎక్కువ టైం నుంచి జైలులో ఉన్నందున.. తనను విడుదల చేయాలని కోరుతూ చార్లెస్ శోభరాజ్ కోర్టులో విజ్ఞాపన సమర్పించారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. శోభరాజ్ విడుదలకు ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి బిమల్ పాడెల్ వెల్లడించారు. విడుదలైన 15 రోజుల్లోగా శోభరాజ్ ను అతడి స్వదేశానికి పంపేయాలని కోర్టు నిర్దేశించిందని పేర్కొన్నారు. అయితే శోభరాజ్ తల్లి వియత్నాం వనిత. అతని తండ్రి భారతీయ మూలానికి చెందినవారు. దీంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఎక్కడికి వెళ్తారనేది వేచి చూడాలి.
పేరు..ఊరు..
చార్లెస్ శోభరాజ్ వియత్నామీస్ మూలానికి చెందినవాడు. అతడు 1944లో వియత్నాంలోని హో చి మిన్ నగరంలో జన్మించారు. చార్లెస్ అసలు పేరు హచ్చంద్ భయోనాని గురుముఖ్ చార్లెస్ శోభరాజ్. చార్లెస్ జీవితంలో కొన్ని సంవత్సరాలు ఆసియా మరియు ఫ్రాన్స్‌లలో గడిచింది. తల్లిదండ్రుల విడాకుల తరువాత, అతని తల్లి చార్లెస్‌ను ఒక ఫ్రెంచ్ లెఫ్టినెంట్‌తో కలిసి పెంచింది.
Also Read: భార్యతో గొడవ.. ఒక్క డాలర్ కోసం జైలుపాలు!
19 ఏళ్లుగా జైలులో
చార్లెస్ శోభరాజ్ ఇద్దరు అమెరికన్ టూరిస్టులను చంపాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే అతను 2003 నుండి .. అంటే గత 19 ఏళ్లుగా నేపాల్ జైలులో ఉన్నాడు. 1970 వ దశకంలో చార్లెస్ భారతదేశం, థాయ్‌లాండ్, టర్కీ,ఇరాన్‌లలో 20 మందికి పైగా వ్యక్తులను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. చార్లెస్‌కు హిప్పీల పట్ల తీవ్రమైన ద్వేషం ఉండేది. 1970వ దశకంలో చార్లెస్ ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హతమార్చాడని చెబుతారు. నీటిలో ముంచి, గొంతు నులిమి, కత్తితో పొడిచి,సజీవ దహనం చేసి అతడు మర్డర్స్ చేశాడని అంటారు. మారు వేశాల్లో జనం మధ్య తిరగడంలో అతడు దిట్ట అని చెబుతుంటారు. చార్లెస్ శోభరాజ్ కు దాదాపు 6 నుంచి 7 భాషలు వచ్చు. అతడు తాను స్నేహం చేసే మహిళలకు మత్తు మందు ఇచ్చి చంపేవాడని అంటారు. తెరెసా నోల్తాన్ అనే మహిళను ఇలా తొలిసారిగా చార్లెస్ శోభరాజ్ చంపాడట