HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Sanctions 4 Entities Supplying Equipment To Pakistans Ballistic Missile Program

US Vs Pakistan : పాక్‌‌కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఎందుకు ?

 అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో(US Vs Pakistan) ఉంది.

  • By Pasha Published Date - 12:40 PM, Thu - 19 December 24
  • daily-hunt
Us Vs Pakistan Us Sanctions Pakistans Missile Program

US Vs Pakistan : పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా అనూహ్య షాక్ ఇచ్చింది. తినడానికి తిండి  లేకున్నా.. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీలో పాకిస్తాన్ బిజీగా ఉందని తెలుసుకున్న అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది.  ఈ ఆంక్షలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి  మాథ్యూ మిల్లర్ వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.

Also Read :Rupee Fall : ఆల్ టైం కనిష్ఠ స్థాయికి రూపాయి పతనం.. కారణాలు ఇవీ..

ఆ నాలుగు కంపెనీల కథ.. 

  • యునైటెడ్ స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (EO) 13382 ప్రకారం పాకిస్తాన్‌లోని నాలుగు కంపెనీలపై ఆంక్షలను ప్రకటించారు.
  • ఆ కంపెనీల పేర్లు.. నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (NDC), అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజ్.
  • ఈ నాలుగు కంపెనీలు సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీ, పంపిణీ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖకు సహకరిస్తున్నాయని అమెరికా గుర్తించింది.  ప్రత్యేకించి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీకి అవసరమైన సామగ్రిని ఈ కంపెనీలు సప్లై చేస్తున్నాయని అగ్రరాజ్యం దర్యాప్తులో తేలిందట. అందుకే వాటికి ఆంక్షలతో బ్రేకులు వేయబోతోంది.
  •  నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (NDC) కంపెనీ హెడ్ క్వార్టర్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉంది.  ఇది పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. లాంగ్ రేంజ్ మిస్సైళ్ల తయారీలో, ప్రయోగంలో వాడే పరికరాలను ఈ కంపెనీ కొనుగోలు చేస్తోంది. షాహీన్ సిరీస్ బాలిస్టిక్ క్షిపణుల తయారీలోనూ ఎన్‌డీసీ కీలక పాత్ర పోషించింది.
  •  అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో(US Vs Pakistan) ఉంది. మిస్సైళ్ల తయారీలో, ప్రయోగాల్లో వాడే పరికరాలు ఈ కంపెనీ నుంచి ఎన్‌డీసీకి సప్లై అవుతున్నాయి.
  •  అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా కరాచీ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ సైతం మిస్సైళ్ల తయారీలో వాడే పరికరాలను ఎన్‌డీసీకి సప్లై చేస్తోంది.
  • రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజ్ అనే కంపెనీ కూడా కరాచీలోనే ఉంది. ఇది కూడా మిస్సైళ్ల తయారీలో వాడే పరికరాలను ఎన్‌డీసీకి సరఫరా చేస్తోంది.
  • ఈ నాలుగు కంపెనీలు చైనా నుంచి మిస్సైళ్ల తయారీ పరికరాలు కొని.. పాకిస్తాన్ రక్షణ శాఖకు అందిస్తుంటాయని సమాచారం.
  • పాకిస్తాన్‌లోని ఎన్‌డీసీ కంపెనీకి మిస్సైళ్ల తయారీ పరికరాలు సరఫరా చేస్తున్న పలు చైనా కంపెనీలపై ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షలు విధించింది. షాహీన్-3 మిస్సైళ్లు, అబాబీల్ సిస్టమ్‌ల కోసం రాకెట్ మోటార్లు, ఇతరత్రా సాంకేతిక పరికరాలను పొందేందుకు బీజింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఫర్ మెషీన్ బిల్డింగ్ ఇండస్ట్రీ‌తో పాకిస్తాన్ కలిసి పనిచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
  • పాకిస్తాన్ మిస్సైల్ టెక్నాలజీ మెరుగుదలకు దోహదపడే పరికరాలను సప్లై చేస్తున్న మూడు చైనా కంపెనీలపై 2023 సంవత్సరంలోనూ అమెరికా ఆంక్షలు విధించింది.

Also Read :Mumbai Terror Attack : ముంబై ఉగ్రదాడి సూత్రధారి రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా వాదన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pakistan
  • Pakistans missile program
  • us
  • US sanctions
  • US Vs Pakistan

Related News

Og Collections Us

OG Box Office : ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న OG ..ప్రీమియర్లతోనే సరికొత్త రికార్డు

OG Box Office : నార్త్ అమెరికా మార్కెట్‌(US Market)లో 'ఓజీ' అరుదైన రికార్డు సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.26 కోట్లు) వసూళ్లు సాధించడం ద్వారా ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

  • H-1B Visas

    H-1B Visa Fee : వీసా ఫీజు పెంపుపై గందరగోళం.. ఆగిన పెళ్లిళ్లు

  • Axar Patel

    Axar Patel: రేపు పాక్‌తో కీల‌క మ్యాచ్‌.. టీమిండియా కీల‌క ఆట‌గాడు దూరం?!

  • H-1B Visas

    H1B Visa : పనికి రాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. హోవర్డ్ కామెంట్స్ వైరల్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd