US -Universities : అమెరికాలో ఖాళీ అవుతున్న యూనివర్శిటీలు
US -Universities : డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా ఓపీటీ (OPT) రద్దు చేయాలన్న నిర్ణయం, విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై మబ్బులు కమ్మేలా చేశాయి
- By Sudheer Published Date - 11:43 AM, Tue - 6 May 25

ఇంతకాలం అమెరికా (America) చదువులంటేనే ఒక గోల్డెన్ ఛాన్స్ అన్న భావన చాలామందిలో ఉండేది. విదేశీ విద్య, విదేశీ జీవితం, మంచి ఉద్యోగం అన్న ఆశలతో లక్షలాది మంది విద్యార్థులు అమెరికా వైపు పోయే ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా ఓపీటీ (OPT) రద్దు చేయాలన్న నిర్ణయం, విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై మబ్బులు కమ్మేలా చేశాయి. తల్లిదండ్రులు కూడా ఈ పరిణామాలను గమనించి తమ పిల్లల భవిష్యత్తు కోసం అమెరికా లాంటి దేశాలకు పంపడం గురించి ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది.
China + Pakistan: పాక్ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?
ఈ సంవత్సరం అమెరికా 1.4 లక్షల విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత సంవత్సరాలలో అయితే ఇవి తెరిచిన కొద్ది సేపటిలోనే భర్తీ అవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. అమెరికన్ కాన్సులేట్‌లు ఖాళీగా ఉండటం, వీసాలపై ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, ఉద్యోగ అవకాశాలపై ఉన్న అనిశ్చితి, ఖర్చుల భారమూ కలగలిపి విద్యార్థులను వెనక్కి నెట్టి వేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తే అమెరికా మీద భారతీయుల ఆధారపడి రోజులు పోయాయి. ఇతర దేశాలతో పోల్చితే మన భారతదేశంలోనే ఇప్పుడు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు ఇక్కడే తమ కార్యాలయాలు విస్తరిస్తూ, పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోటి రూపాయలు ఖర్చు చేసి అమెరికా వెళ్లడం కన్నా, మన దేశంలోని మంచి విశ్వవిద్యాలయాల్లోనే తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పొందడం అనేది తెలివైన ఎంపికగా మారుతోంది.