HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Chinas Support To Pakistan China Is Giving These Weapons To Pak

China + Pakistan: పాక్‌ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?

పాకిస్తాన్‌(China + Pakistan) ప్రధానంగా ఐదు దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.

  • By Pasha Published Date - 11:14 AM, Tue - 6 May 25
  • daily-hunt
China + Pakistan India Vs Pakistan China Weapons To Pakistan

China + Pakistan:‘‘పాకిస్తాన్‌‌కే మా ఫుల్ సపోర్ట్’’ అని చైనా మొదటి నుంచీ అంటోంది. భారత్‌తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్‌కు సపోర్ట్ అందిస్తామని చైనా తేల్చి చెబుతోంది. పాకిస్తాన్, భారత్ యుద్దం జరగాలని..  తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడాలని చైనా కోరుకుంటోంది. యాపిల్ లాంటి పెద్దపెద్ద కంపెనీలు భారత్‌ను వీడాలనేది చైనా స్కెచ్. అందుకే పాకిస్తాన్‌తో భారత్‌కు యుద్ధం చేయించాలని కుట్రలు పన్నుతోంది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఆర్మీతో పాటు చైనా నిఘా సంస్థల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే పక్కా ఆధారాలు లభించాకే దీన్ని మనం ధ్రువీకరించగలం. ఇంతకీ పాకిస్తాన్‌ సైన్యానికి చైనా ఎలాంటి సాయం చేయగలదు ? ఇప్పటిదాకా పాక్ సైన్యానికి చైనా చేసిన  సాయం ఏమిటి ? మనం తెలుసుకుందాం..

Also Read :India Attack Plan : మానవరహిత విమానాలతో పీఓకేపై ఎటాక్.. తజకిస్తాన్ నుంచి వార్ ?

చైనా ఉత్పత్తులు.. మనదేశంలో ఇంకా అవసరమా ? 

ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఆరో ప్రాణం చైనా. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం డీలా పడింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. అప్పులపై ఆధారపడి పాకిస్తాన్ ప్రభుత్వం నడుస్తోంది. అయినా భారత్‌కు సవాళ్లు విసిరేంత ధైర్యం పాకిస్తాన్‌కు ఎక్కడి నుంచి వస్తోంది ? అంటే.. చైనా నుంచే వస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చైనా, పాకిస్తాన్‌ సైన్యాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఏవైనా యుద్ధాలు జరిగితే పరస్పరం సహకరించుకోవాలనే సీక్రెట్ అగ్రిమెంట్లు కూడా ఉన్నాయని అంటారు. అమెరికా నుంచి చైనాకు ముప్పు ఉంది. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే..  పాకిస్తాన్ వైపు నుంచి సాయం పొందాలనేది చైనా లాంగ్ టర్మ్ ప్లాన్. పాకిస్తాన్, చైనా రెండూ అణ్వాయుధ దేశాలే కాబట్టి.. అమెరికాకు చెమటలు పట్టించొచ్చు అనేది డ్రాగన్ స్కెచ్.  అందుకే ఇప్పుడు భారత్‌తో యుద్ధానికి రెడీ అవుతున్న పాకిస్తాన్‌కు చైనా మద్దతును ప్రకటించింది. ఎందుకంటే చైనాకు భారత్‌తో  స్నేహం కంటే దాని లాంగ్ టర్మ్ లక్ష్యాలే కీలకం. ఇంత కరాకండీగా వ్యవహరిస్తున్న చైనా ఉత్పత్తుల అమ్మకాలను మన దేశంలో ఆపేయాల్సిన అవసరం ఉంది.

Also Read :War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?

81 శాతం ఆయుధాలు చైనా నుంచే.. 

పాకిస్తాన్‌(China + Pakistan) ప్రధానంగా ఐదు దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో చైనా ఉంది. పాకిస్తాన్ సైనిక కొనుగోళ్లలో 81 శాతం చైనా నుంచే జరుగుతుంటాయి. మిగతా సైనిక కొనుగోళ్ల కోసం స్వీడన్, రష్యా, అమెరికా, ఇటలీ దేశాలపై పాకిస్తాన్ ఆధారపడుతుంటుంది. భారత్‌తో యుద్ధమే మొదలైతే చైనా నుంచి పాకిస్తాన్‌కు నిరంతరాయంగా ఆయుధాల సప్లై జరుగుతుంది. యుద్ధం ముగిసే వరకు చైనా నుంచి పాక్‌కు సపోర్ట్ లభించే అవకాశం ఉంది. భారత్ – పాక్ యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే.. చైనాకు అంత ఎక్కువ లాభం. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ డీలా పడుతుందని చైనా అంచనా వేస్తోంది.

చైనా నుంచి పాక్‌కు అందే ఆయుధాలివీ.. 

  • పాకిస్తాన్ సైన్యం వినియోగిస్తున్న JF-17 యుద్ధ విమానాలు చైనా నుంచి కొన్నవే. వీటిని సర్గోధా, మౌరిపూర్ ఎయిర్‌బేస్‌లలో మోహరించారు. ఈ ఫైటర్ జెట్లలో వాడే మిస్సైళ్లను కూడా చైనా నుంచే పాక్ కొనుగోలు చేసింది.
  •  F-7PG స్కైబోల్ట్ యుద్ధ విమానాలు చైనా నుంచి పాక్‌కు అందాయి.
  • పాకిస్తాన్ సైనిక శిక్షణ అవసరాల కోసం చైనాకు చెందిన K-8 కారకోరం విమానాలను వాడుతుంటారు.
  • చైనా నుంచి వింగ్ లూంగ్ II, CH-4 UAV డ్రోన్లను పాక్ కొనుగోలు చేసింది.
  • చైనా నుంచి CM-400AKG అనే యాంటీ-షిప్ మిసైల్, C-802AK అనే  క్రూయిజ్ మిసైల్‌లను పాక్ కొనుగోలు చేసింది.
  • పాక్ వాడుతున్న టైప్ 59, 69, 85-IIAP యుద్ధ  ట్యాంకులు చైనావే. VT-4  అనేది పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన యుద్ధ ట్యాంక్.
  • చైనా తయారు చేసిన KJ-2000 రాడార్ వ్యవస్థను పాక్ వాడుతోంది.
  • HJ-8, HJ-10 ATGMs అనే చైనా తయారీ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను పాక్ వినియోగిస్తోంది.
  • LY-80 (HQ-16)  అనేది ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై దాడిచేసే మిసైల్ సిస్టమ్. దీన్ని చైనా నుంచి పాక్ కొనుగోలు చేసింది.
  • FN-6 MANPADS అనే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చైనా నుంచి పాక్ కొనేసింది.
  • పాకిస్తాన్ యుద్ధ నౌకలపై SR2410C అనే రాడార్ వ్యవస్థ ఉంది. ఇది మేడిన్ చైనా.
  • C-802, YJ-62, CM-302 అనే మేడిన్ చైనా యాంటీ షిప్ క్షిపణులను పాక్ నేవీ వాడుతోంది.
  • LY-60N అనే నావల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ను పాక్ వాడుతోంది.
  • హార్బిన్ Z-9EC  అనే యాంటీ సబ్‌మెరైన్ హెలికాప్టర్లను చైనా నుంచి పాక్ పొందింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • China + Pakistan
  • China Weapons
  • Chinese Weapons
  • india
  • India vs Pakistan
  • pakistan

Related News

Asia Cup Trophy Controversy

Asia Cup Trophy : ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. BCCI వాకౌట్

Asia Cup Trophy : నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

  • Trump Tariffs

    Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?

  • Asia Cup

    Asia Cup: ఆసియా క‌ప్ గెలిచిన భార‌త్‌.. కానీ ట్రోఫీ ఎక్క‌డా?

  • H1 B

    H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • India

    India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

Latest News

  • Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

  • IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!

  • OG Item Update : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’లో స్పెషల్ సాంగ్

  • Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!

  • Gas Cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

Trending News

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd