HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Ukraine Embassies Receive Packages Containing Animal Eyes

Ukraine Embassies: ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు నెత్తుటి ప్యాకేజీలు

వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాల గత వారం రోజులుగా జంతువులు కళ్లు, రక్తంతో కూడిన ప్యాకేజీలను రష్యా పంపుతుంది.

  • Author : Gopichand Date : 04-12-2022 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాల గత వారం రోజులుగా జంతువులు కళ్లు, రక్తంతో కూడిన ప్యాకేజీలను రష్యా పంపుతుంది. జంతువుల కళ్లతో, రక్తంతో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను రష్యా.. అనేక యూరోపియన్ నగరాల్లోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లకు పంపుతున్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

6 యూరోపియన్ దేశాలలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు ఇటీవల జంతువుల కళ్లతో కూడిన ప్యాకేజీలను అందుకున్నాయని ఉక్రెయిన్‌ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతు కళ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని ఆయన చెప్పారు. హంగేరి, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన ప్యాకేజీలను రష్యా పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

ది గార్డియన్ కథనం ప్రకారం.. పార్శిల్ వచ్చిన వెంటనే పోలీసులు ఎంబసీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. స్నిఫర్ డాగ్‌లతో ఆ ప్రాంతాన్ని శోధించారు. లెటర్ బాంబులు, ఆవులు, పందుల కళ్లు వంటి జంతు భాగాలతో కూడిన ప్యాకేజీలను స్వీకరించిన ఎంబసీలకు సంబంధించి ఇప్పటివరకు 17 కేసులు వచ్చాయని సమాచారం. రష్యా ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు.

ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. రష్యా రాయబార కార్యాలయాలు మాత్రం ఆ ఆరోపణలను ఖండించాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Animal Eyes
  • Packages
  • Russia Ukraine Crisis
  • Ukraine Embassies
  • world news

Related News

SAVE Act Bills

సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

ఈ కొత్త చట్టం ద్వారా ఈ వైవిధ్యమైన పద్ధతులన్నింటినీ తొలగించి, ఓటింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

  • Dancing Missile

    సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

  • Russia- America

    అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

  • Trump- PM Modi

    ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd