Man Stole Electricity: విద్యుత్ దొంగతనం.. కూతురు కోసం తండ్రి అత్యాశ
లెస్లీ పిరీ అనే ఎలక్ట్రీషియన్ తన పొరుగు ఇంటివాళ్ళకి 4,000 పౌండ్లు (రూ. 433138) తిరిగి చెల్లించాలని కోర్టు కోరింది. బ్రిటన్‌లోని టేపోర్ట్ నగరంలో నివసిస్తున్న లెస్లీ పిరీ విద్యుత్‌ను దొంగిలించడానికి ఒక పరికరాన్ని ఉపయోగించాడు
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Fri - 19 July 24

Man Stole Electricity: విద్యుత్ చౌర్యం కేసులో తండ్రి చేసిన తప్పుకి కూతురు బలైంది. కోర్టు ఆదేశాల మేరకు ఓ యువతీ అరెస్ట్ అయింది. బ్రిటన్‌లో విద్యుత్ చోరీకి సంబంధించిన వింత ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన పొరుగు ఇంటి నుండి విద్యుత్ దొంగిలించాడు. అతని కుమార్తె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించి ఆ తండ్రి విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
బ్రిటీష్ వార్తా ఛానెల్ బీబీసీ నివేదించిన ప్రకారం… లెస్లీ పిరీ అనే ఎలక్ట్రీషియన్ తన పొరుగు ఇంటివాళ్ళకి 4,000 పౌండ్లు (రూ. 433138) తిరిగి చెల్లించాలని కోర్టు కోరింది. బ్రిటన్‌లోని టేపోర్ట్ నగరంలో నివసిస్తున్న లెస్లీ పిరీ విద్యుత్‌ను దొంగిలించడానికి ఒక పరికరాన్ని ఉపయోగించాడు. జూలై 2017 నుండి ఆగస్టు 2020 వరకు తన పొరుగువారి ఇంటి నుండి విద్యుత్తు దొంగిలించబడినట్లు 51 ఏళ్ల పిరీ కోర్టు ముందు అంగీకరించాడు.
లెస్లీ పిరీ తన ఇంట్లో అమర్చిన విద్యుత్ మీటర్‌ను ఇరుగుపొరుగు హగ్ మరియు ట్రేసీ టోరెన్స్ ఇంట్లో అమర్చిన విద్యుత్ మీటర్‌కు కనెక్ట్ చేశాడు. ఈ క్రమంలో వీళ్ళ బిల్లులను కూడా పొరుగింటి వాళ్లే చెల్లిస్తున్నారు. పిరి విద్యుత్ చౌర్యం కారణంగా పొరుగువారు 4,000 పౌండ్లు నష్టపోయారు. అంటే దాదాపు 4 లక్షల రూపాయలు నష్టపోయారు. ఈ సంఘటన తర్వాత లెస్లీ పిరీ మరియు ఎదురింటి వారికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇష్యూ కోర్టుకు వెళ్లడంతో భారీ జరిమానా విధించారు.
Also Read: Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!