Trump Praises PM Modi: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
చర్చల గురించి డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా ప్రధాని మోదీ కఠినమైన సంధానకర్త అని అన్నారు. అతను నాకంటే మంచి సంభాషణకర్త. అతనికి, నాకు మధ్య పోలిక లేదని బదులిచ్చారు.
- Author : Gopichand
Date : 14-02-2025 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Praises PM Modi: ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన అక్కడ పలువురు ప్రముఖులను కలిశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల అధినేతల మధ్య పలు కీలక ప్రకటనలు జరిగాయి. వీటిలో వాణిజ్యం నుంచి తీవ్రవాదం వరకు ఉన్నాయి. అమెరికా, భారత్‌ల మధ్య గొప్ప ఐక్యత, గాఢమైన స్నేహం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Praises PM Modi) చెప్పారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలన్నీ చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగ్గా, పటిష్టమవుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు.
ప్రధాని మోదీ నా కంటే గొప్పవాడు- డొనాల్డ్ ట్రంప్
ప్రధాని మోదీతో స్నేహం గురించి డొనాల్డ్ ట్రంప్‌ను అడిగినప్పుడల్లా.. మా మధ్య చాలా ఐక్యత, లోతైన స్నేహం ఉంది. మనం, మన దేశం మరింత దగ్గరవ్వబోతున్నాం. దేశాలుగా మనం ఐక్యంగా ఉండాలి. మేము స్నేహితులుగాఎల్లప్పుడూ ఉంటామని అన్నారు. చర్చల గురించి డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా ప్రధాని మోదీ కఠినమైన సంధానకర్త అని అన్నారు. అతను నాకంటే మంచి సంభాషణకర్త. అతనికి, నాకు మధ్య పోలిక లేదని బదులిచ్చారు.
Also Read: IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్‌లను ఇకపై ఉచితంగా చూడలేరు.. కారణమిదే?
ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు
డోనాల్డ్ ట్రంప్ ఇంకా మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీని చాలా మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అద్భుతమైన పనికి ప్రసిద్ధి అని ఆయన అన్నారు. భారతదేశంలో అతని పథకాలు చాలా ప్రశంసించబడ్డాయి. అతను గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందాడు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘అమెరికా అధ్యక్షుడి నుండి ప్రశంసలు విన్న తరువాత ప్రధాని మోదీ తన కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ మాటలకు నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతదేశంలోని ప్రతి పౌరుడు మీ మనోభావాలను గౌరవిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ సమావేశమైనప్పుడు.. ‘మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం’ అని ట్రంప్ అన్నారు.