Assad 2100 Crores : వామ్మో.. సిరియా నుంచి అసద్ అంత డబ్బు తీసుకెళ్లాడా ?
అసద్ సంపదకు సంబంధించి నిర్వహణకు అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఆర్థికసేవల సంస్థ జేపీ మోర్గాన్ సంస్థలో(Assad 2100 Crores) పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సాయం చేసినట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 01:26 PM, Mon - 16 December 24

Assad 2100 Crores : సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వస్తున్నాయి. ఆయన సిరియా నుంచి రష్యాకు పారిపోయేటప్పుడు భారీగా నోట్ల కట్టలను విమానంలో పెట్టుకొని తీసుకెళ్లారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. అసద్ దాదాపు రూ.2,100 కోట్లను రష్యాకు తీసుకెళ్లారని తెలుస్తోంది. వాస్తవానికి 2018 నుంచే డబ్బును రష్యాకు పంపే ప్రక్రియను అసద్ ప్రారంభించారని అంటున్నారు. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 2 టన్నుల బరువైన 100 డాలర్ల బిల్లులు, 500 యూరో నోట్లను సిరియా సెంట్రల్ బ్యాంకుకు చెందిన విమానాల్లో మాస్కోకు పంపారట. ఈ విమానంలో సిరియా రాజధాని డమస్కస్ నుంచి రష్యాలోని వ్యూంకోవ్ ఎయిర్‌పోర్టుకు డబ్బులను తీసుకెళ్లేవని కథనాల్లో పేర్కొన్నారు. రష్యా బ్యాంకుల్లో ఆ డబ్బును జమ చేసేవారు. 2019 మేలో ఒక విమానంలో దాదాపు 10 మిలియన్ డాలర్ల విలువైన నోట్ల కట్టలను సిరియా నుంచి రష్యాకు అసద్ తరలించారట.
Also Read :Rajkapoor Songs : రాజ్‌కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్
అమెరికా సంస్థ ఉద్యోగి సాయం..
అసద్ తన అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు ఇలా నిధులను రష్యాకు తరలించి ఉంటారని అంటున్నారు. అసద్ సంపదకు సంబంధించి నిర్వహణకు అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఆర్థికసేవల సంస్థ జేపీ మోర్గాన్ సంస్థలో(Assad 2100 Crores) పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సాయం చేసినట్లు తెలుస్తోంది. సిరియా నుంచి అసద్ పంపిన ఫండ్స్‌ను రష్యాలోని ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంక్, టీఎస్‌ఎంఆర్ బ్యాంక్‌లలో డిపాజిట్ చేశారని సమాచారం. ఈ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ బ్యాంకులు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్, లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా నిర్వహించే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని చెబుతున్నారు. ఈ డబ్బులతో ముడిపడిన వ్యవహారాలను అసద్ ఆర్థిక సలహాదారుడు యాసిర్ ఇబ్రహీం చూసుకుంటున్నట్లు తెలిసింది.
Also Read :Zakir Hussains Last Post : జాకిర్ హుస్సేన్ చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
అసద్ సంపద ఎంత ?
అసద్ వద్ద మొత్తం 200 టన్నుల బంగారం, రూ.1.35 లక్షల కోట్ల నగదు, రూ.44 వేల కోట్ల నగదు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అసద్ ఫ్యామిలీకి మొత్తంగా రూ.16 వేల కోట్ల నికర ఆస్తి ఉందని సమాచారం. సిరియాలో శక్తిమంతమైన వ్యాపారవేత్త రామీ మఖ్‌లౌఫ్ 2020లో అసద్ కుటుంబంతో విభేదించాడు. దీంతో అతడి సంపదను సిరియా ప్రభుత్వం సీజ్ చేసింది. దానిలో దాదాపు రూ.42వేల కోట్లను అసద్ కుటుంబం లాక్కుందనే ప్రచారం ఉంది.