Rajkapoor Songs : రాజ్‌కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్
రాజ్‌కపూర్(Rajkapoor Songs) పాట 'జీనా యహాన్ మర్నా యహాన్' అనే పాటను ఆయన పాడి శ్రోతలను అలరించారు.
- By Pasha Published Date - 12:31 PM, Mon - 16 December 24

Rajkapoor Songs : ప్రఖ్యాత నటుడు రాజ్‌కపూర్‌ను సినీ ప్రపంచం ఎప్పటికీ మరువదు. ఆయన 100వ జయంతి సందర్భంగా ‘ఆవారా హు’ పేరిట రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఉడాన్, రోటరీ క్లబ్ క్రౌన్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంటిన్యూగా 30 గంటలపాటు రాజ్‌కపూర్ సినిమాలలోని పాటలను ఆలపించారు. దీంతో ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ను గాయకుల టీమ్ సొంతం చేసుకున్నారు. ఈ పాటలను పాడిన టీమ్‌లో 260మందికి పైగా సింగర్స్ ఉన్నారు. వీరంతా కలిసి 30 గంటల వ్యవధిలో 450 కంటే ఎక్కువ పాటలు పాడారు.
Also Read :Zakir Hussains Last Post : జాకిర్ హుస్సేన్ చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు రాజ్‌కపూర్ పాటల పర్వం కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన హవా మహల్ ఎమ్మెల్యే బాల్‌ముకుంద్ ఆచార్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రాజ్‌కపూర్(Rajkapoor Songs) పాట ‘జీనా యహాన్ మర్నా యహాన్’ అనే పాటను ఆయన పాడి శ్రోతలను అలరించారు. ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ.. అందులో వాడిన ప్రతీ పదం శాశ్వతమైనది, సత్యమైనది అని చెప్పారు. రాజ్‌కపూర్ ఉన్నా, లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని బాల్‌ముకుంద్ ఆచార్య పేర్కొన్నారు.
Also Read :Ilaiyaraaja : ఇళయ రాజాకు అవమానం.. గర్భగుడి నుంచి బయటకు పంపిన ఆలయ నిర్వాహకులు
రాజ్‌కపూర్ సినిమా.. మోడీ ఏమన్నారంటే..
రాజ్‌కపూర్ శతజయంతి సందర్భంగా ఇటీవలే ఆయన కుటుంబం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసింది. ఆ సందర్భంగా గతంలో జరిగిన ఓ ఘటనను కపూర్ కుటుంబ సభ్యులతో మోడీ పంచుకున్నారు. ‘‘జనసంఘ్ హయాంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మేం ఓడిపోయాం. ఆ సమయంలో ఇక ఏం చేేద్దామని ఎల్‌కే అద్వానీ, వాజ్‌పేయి చర్చించుకున్నారు. అనంతరం రాజ్‌కపూర్ సినిమా చూడటానికి వారిద్దరూ వెళ్లారు. కట్ చేస్తే.. తర్వాతి కాలంలో బీజేపీ అధికార పీఠంపై కూర్చుంది’’ అని మోడీ తెలిపారు. అప్పట్లో అద్వానీ, వాజ్‌పేయి కలిసి రాజ్‌కపూర్‌కు చెందిన ‘ఫిర్ సుబహ్ హోగీ’ (1958) సినిమాను చూశారని ఆయన తెలిపారు. ఆ సినిమా టైటిల్‌కు తగినట్టుగానే బీజేపీకి శుభోదయం లభించిందన్నారు.