Zakir Hussains Last Post : జాకిర్ హుస్సేన్ చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
ఒక ఆహ్లాదకరమైన వీడియోను పోస్ట్ చేసిన జాకిర్ హుస్సేన్(Zakir Hussains Last Post) .. ‘ఇది అద్భుతమైన క్షణం’ అని క్యాప్షన్ రాశారు.
- By Pasha Published Date - 12:01 PM, Mon - 16 December 24

Zakir Hussains Last Post : తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ (73) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. గుండె సమస్యల కారణంగా ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేన్ గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందారని చెప్పారు. చికిత్స అందించే క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించారని తెలిసింది. జాకిర్ హుస్సేన్ మరణానికి ఆయన అభిమానుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరు వారా లక్రితం అక్టోబరు 29న ఆయన ఈ పోస్ట్ చేశారు. ఒక ఆహ్లాదకరమైన వీడియోను పోస్ట్ చేసిన జాకిర్ హుస్సేన్(Zakir Hussains Last Post) .. ‘ఇది అద్భుతమైన క్షణం’ అని క్యాప్షన్ రాశారు.
Also Read :Ilaiyaraaja : ఇళయ రాజాకు అవమానం.. గర్భగుడి నుంచి బయటకు పంపిన ఆలయ నిర్వాహకులు
అక్టోబరు నెలలో అమెరికాలో శరదృతువు ఉంటుంది. ఆ టైంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చల్లటి పిల్లగాలులు వీస్తుండటం.. గాలి వేగానికి చెట్ల కొమ్మలు ఊగుతుండటం అనేది జాకిర్ హుస్సేన్ పోస్ట్ చేసిన వీడియోలో ఉంది. దీన్నిబట్టి నేచర్‌తో ఆయనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జాకిర్ చనిపోయిన తర్వాత ఆయన చివరి ఇన్‌స్టా పోస్ట్‌ను చాలా మంది షేర్ చేసి నివాళులు అర్పిస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో అద్భుతమైన కళాకారుడు అంటూ కొనియాడుతున్నారు.
దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ‘ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్’ కారణంగా జాకిర్ హుస్సేన్ చనిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన 66వ గ్రామీ అవార్డ్స్‌లో మూడు పురస్కారాలను గెల్చుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ (ది మూమెంట్ బై శక్తి), బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫామెన్స్ (పాష్టో), బెస్ట్ కాంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ (యాజ్ వుయ్ స్పీక్) కేటగిరీలలో జాకిర్‌కు పురస్కారాలు వచ్చాయి.