MQ-9 REAPER: అమెరికా-రష్యాల మధ్య తీవ్ర స్థాయికి చేరుకున్న ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే?
ఉక్రెయిన్-రష్యా ఈ రెండు దేశాల మధ్య జై జరుగుతున్న దాడుల గురించి మనందరికీ తెలిసిందే.
- By Nakshatra Published Date - 09:20 PM, Wed - 15 March 23

MQ-9 REAPER: ఉక్రెయిన్-రష్యా ఈ రెండు దేశాల మధ్య జై జరుగుతున్న దాడుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి రష్యా దేశం ఉక్రెయిన్ దేశంపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం ప్రాణం నష్టం కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దండయాత్రలో తాజాగా జరిగిన ఉదంతంతో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరాయి. నల్లసముద్రం పై అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న ఎంక్యూ రీపర్ 9 డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు అడ్డుపడటంతో డ్రోన్ సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే.
రష్యా సరిహద్దుకు దూరంగా గస్తీ నిర్వహిస్తున్న రీపర్ డ్రోన్‌పై రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు ఇంధనాన్ని కురిపించాయి. అనంతరం డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొనడంతో డ్రోన్ సముద్రంలో కూల్చేసుకున్నట్లు అమెరికా పేర్కొంది. రష్యన్ పైలట్లు ఎటువంటి అవగాహన లేకుండా డ్రోన్‌ను అడ్డుకున్నారని అమెరికా సంయమనం పాటించకుంటే రెండు రష్యా విమానాలు నేలకూలిండేవని అమెరికా వాయుసేన అధికారులు వెల్లడించారు. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న అనంతరం నల్లసముద్రంపై రష్యా వాయుసేన రాకపోకలు మరింత ఎక్కువ అయ్యాయి.
అయితే తాము రష్యా గగనతలంలోకి రాలేదని గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ గగన తలంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. కాగా అమెరికా ప్రకటనను రష్యా అధికారవర్గాలు ఖండించాయి. తమ సరిహద్దుల్లోకి రావడంతో రెండు యుద్ధ విమానాలు దానిని అడ్డుకునేందుకు యత్నించాయి. అయితే ఈ క్రమంలో డ్రోన్ కూలిపోయిందని రష్యా విమానాలు ఎలాంటి ఇంధనాన్ని కుమ్మరించలేదని తెలిపింది.

Related News

Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.