HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >The First Step Towards Ending The Israel Hamas War That Has Been Going On For The Past Two Years Has Been Taken

Modi : గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.!

  • By Vamsi Chowdary Korata Published Date - 12:17 PM, Fri - 10 October 25
  • daily-hunt
Netanyahu Pm Modi
Netanyahu Pm Modi

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం గురించి గురువారం రోజు భద్రతా క్యాబినేట్‌తో చర్చించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే.. నెతన్యాహు ఎవరూ ఊహించని ఓ పని చేశారు. ఈ కీలకమైన సమావేశాన్ని నిలిపివేసి మరీ.. తన ప్రియమైన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయమే వెల్లడించింది.

ఈ సంభాషణ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళికలో సాధించిన పురోగతిపై ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. నా మిత్రుడు, ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి.. అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలో సాధించిన పురోగతికి అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. బందీలను విడుదల చేసే ఒప్పందాన్ని, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయాన్ని అందించేందుకు కుదిరిన అంగీకారాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదు అని మరోసారి స్పష్టం చేశామని మోదీ పోస్ట్ చేశారు.

Called my friend, Prime Minister Netanyahu, to congratulate him on the progress made under President Trump’s Gaza peace plan. We welcome the agreement on the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza. Reaffirmed that terrorism in any form or…

— Narendra Modi (@narendramodi) October 9, 2025

చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక వజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని చెప్పింది. బందీలందరినీ విడుదల చేసేందుకు కుదిరిన ఒప్పందానికి ప్రధాని నెతన్యాహుకు నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారని వివరించింది.

గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్ గురువారం రోజు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. కాల్పుల విరమణ జరుగుతుంది. గాజా నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది. తాను బంధించిన బందీలు అందరినీ హమాస్ విడుదల చేస్తుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తన అధీనంలో ఉన్న వందలాది మంది పాలస్తీనా బందీలను విడుదల చేస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benjamin Netanyahu
  • Donald Trump
  • Hamas
  • Israel PM Netanyahu
  • Israel.
  • PMModi

Related News

Donald Trump

Trump 3rd Time : ట్రంప్ మూడోసారి కోరిక నెరవేరుతుందా..?

Trump 3rd Time : ప్రస్తుతం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిలో ఉన్న ట్రంప్, భవిష్యత్తులో కూడా మరోసారి పోటీ చేయాలనే ఆలోచన ఉందన్న సంకేతాలు ఇచ్చారు

  • Donald Trump

    Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

Latest News

  • Heart Attack: హార్ట్ ఎటాక్ వస్తుందని తెలిపే సిగ్నల్ ఇదే .. గుర్తించకపోతే అంతే !!

  • Heavy Rains : ఏపీకి బిగ్ షాక్ ..నవంబర్ లో మరో మూడు తుఫాన్లు..!!

  • Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

  • Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగ అవకాశాలు

  • Salman Meets CM Revanth : సీఎం రేవంత్ తో సల్మాన్ ఖాన్ భేటీ

Trending News

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd