Somalia Mogadishu bombings: పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100 మందికిపైగా మృతి..!
సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే జాబ్ కూడలి సమీపంలో రెండు భారీ కారు బాంబు పేలుళ్లు సంభవించాయి.
- By Gopichand Published Date - 06:21 PM, Sun - 30 October 22

సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే జాబ్ కూడలి సమీపంలో రెండు భారీ కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 100 మందికి పైగా మృతి చెందారు. మరో 300మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లను ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ‘అల్ షబాబ్’ అనే సంస్థ చేసిందని ఆ దేశ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు.
సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే జంక్షన్ సమీపంలో జరిగిన జంట కారు బాంబు పేలుళ్లలో కనీసం 100 మంది మరణించారని అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ తెలిపారు. గాయపడిన 300 మందికి అంతర్జాతీయ వైద్య సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని శనివారం నాటి దాడికి అల్ షబాబ్ మిలిటెంట్ గ్రూప్ కారణమని అధ్యక్షుడు ఆరోపించారు. అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఫెడరల్ సోమాలి ప్రభుత్వంతో దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది.
ఐదు నెలల పాటు అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ మొహముద్ ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఆగస్టులో మొగదిషులోని ఒక ప్రముఖ హోటల్‌పై దాడి చేసిన ఘటనలో కనీసం 21 మందిని చనిపోయారు. శనివారం జరిగిన పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఈ ఘటనలో సమీపంలోని భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.